Allu Arjun: అల్లు అర్జున్‌కు ఆహ్వానం.. వెళ్తాడా?

ABN, Publish Date - Jun 21 , 2024 | 06:41 PM

వరలక్ష్మీ శరత కుమార్‌ (VaraLakshmi Sarathkumar) త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ముంబై వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌తో (nicholai sachdev)ఆమె ఏడు అడుగులు వేయనుంది.

వరలక్ష్మీ శరత కుమార్‌ (VaraLakshmi Sarathkumar) త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ముంబై వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌తో (nicholai sachdev)ఆమె ఏడు అడుగులు వేయనుంది. తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరినీ ఆమె పెళ్లికి ఆహ్వానిస్తుంది. తాజాగా పెళ్లికి రావాల్సిందిగా అల్లు ఫ్యామిలీని ఆహ్వానించింది. అల్లు అరవింద్‌ (Allu Aravind), బన్నీకి (Allu arjun) పెళ్లి పత్రికలు అందజేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి.  

శుక్రవారం ఉదయం గీతా ఆర్ట్స్‌లో ఆమె అరవింద్‌ను కలిసినట్లు తెలిస్తోంది. ఆయనతో, బన్నీతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలను తనకు కాబోయే భర్త తీశాడట. నికోలయ్‌ను బన్నీకి పరిచయం చేసింది వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. వాళ్ళిద్దరి మధ్య క్యూట్‌ సంభాషణ జరిగింది.

అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్‌ నిర్మించిన ‘కోట బొమ్మాళి పీఎస్‌’లో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రోల్‌ చేశారు. కాబోయే భర్తతో హైదరాబాద్‌ వచ్చిన వరలక్ష్మీ ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చింది. తాను ఫోటోకి ఫోజ్‌ ఇస్తుంటే... నికోలయ్‌ ఏటో చూస్తున్నారని ఆవిడ  చేసిన పోస్ట్‌లో పేర్కొంది.


'క్రాక్‌' సినిమాతో జయమ్మ పాత్రతో తెలుగునాట పాపులర్‌ అయిన వరలక్ష్మీ అక్కడి నుంచి వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశం అందుకుంటోంది. హీరోయిన్  గా  కాకుండా పాత్ర తనకు సూట్‌ అవుతుంది అంటే నెగటివ్‌ రోల్‌ చేయడానికి కూడా వెనకాడటం లేదు.

Updated Date - Jun 21 , 2024 | 07:04 PM