Unstoppable S4: సీఎం చంద్ర‌బాబుతో.. బాలయ్య అన్‌స్టాప‌బుల్ షో! ఏం విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయంటే

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:17 PM

బాలయ్య అన్‌స్టాప‌బుల్ టాక్ షోలో సీఎం ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండోసారి గెస్టుగా పాల్గొంటున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ సారి షోలో ప్రధానంగా ఏం విషయాలు చర్చకు వచ్చాయనే వార్త‌లు బాగా వైర‌ల్ అవుతున్నాయి.

Unstoppable S4

బాలయ్య (Nandamuri Balakrishna) అన్‌స్టాప‌బుల్ (UnstoppableS4) టాక్ షోలో ప్ర‌స్తుత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రెండోసారి గెస్టుగా పాల్గొంటున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్ప‌టికే ఈ ఆదివారమే ఇందుకు సంబంధ‌ఙంచిన‌ ఎపిసోడ్ షూట్ కూడా జరిగిపోయింది. అయితే ఈ సారి షోలో ప్రధానంగా ఏపీ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు.. తప్పుడు కేసులో జైలుకు పంపటం, జైలు నుంచి విడుదలైన అనంతరం..‌ ఆయనకు ప్రజల నుంచి లభించిన ఆదరణ ఇత్యాది విషయాలు చర్చకు వచ్చాయని సమాచారం..

దీంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి వారసుడు ఎవరనే దానిపై లోకేష్ (Nara Lokesh) విషయంలో చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఏమిటి.. అసలు మనసులో ఏమనుకుంటున్నారనే విషయం కూడా బయట పడిందని తెలుస్తొంది. అంతేకాదు బాలయ్య, చంద్రబాబు మధ్య జ‌రిగిన చర్చల్లో పార్టీ, కష్టకాలం, ముందుకు వచ్చిన వారు, పోరాడిన వారు ఇలా పలు విషయాలు చర్చకు వచ్చాయి.

పార్టీ.. ఎవరి కోసమో చూస్తూ కూర్చోదని, అలాగే వారసత్వం అనేది ఉండదని.. కార్యకర్తగా మొదలై, నాయకుడిగా ఎదిగి తనను తాను ప్రూవ్ చేసుకున్నవారికే పగ్గాలు అందుతాయని.. లోకేష్ (Nara Lokesh) అలా ప్రూవ్ చేసుకున్నాడ‌నే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎవరి కోసమో చూస్తూ కూర్చునేది లేదు. పార్టీ కోసం కుటుంబం అంతా బయటకు వచ్చింది.. నందమూరి అడపడుచులు సైతం పార్టీ కోసం కష్టపడుతున్నారనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అక్టోబర్ 25 రాత్రి 8:30 కు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుండగా.. ఇంద‌కు సంబంధించిన UnstoppableS4 ప్రోమోను నేడో రేపో స‌ద‌రు ఓటీటీ మేక‌ర్స్ విడుదల చేయనున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 12:17 PM