Manchu Vishnu vs Prakash Raj: పవన్ కళ్యాణ్ పోస్ట్‌పై.. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య వార్
ABN, Publish Date - Sep 21 , 2024 | 03:49 PM
ఆ మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య ఎటువంటి వార్ నడిచిందో తెలియంది కాదు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం విశేషం. ఆ ఎన్నికల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వారిద్దరి మధ్య మరో వార్ మొదలైంది.. అదేంటో ఈ స్టోరీలో చూసేయండి
ఆ మధ్య జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య ఎటువంటి వార్ నడిచిందో తెలియంది కాదు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం విశేషం. ఆ ఎన్నికలలో మంచు విష్ణు గెలిచి.. ‘మా’ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత వీరిద్దరూ కామ్‌గా ఎవరిపని వారు చేసుకుంటూ వెళుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకూ తిరుపతి లడ్డు కల్తీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం హాట్ టాపిక్‌గా నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ లడ్డు వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ హిందూ ఐటీ విభాగం చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ చేసిన పోస్ట్ కూడా ప్రస్తుతం వార్తలలో నిలుస్తోంది.
Also Read- Devara: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఫ్యాన్స్‌కి పండగే!
ముందుగా పవన్ కళ్యాణ్ హిందూ ఐటీ విభాగం చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసి నిర్మూలించాలి’’ అని పోస్ట్ చేశారు
ఈ పోస్ట్‌ని రీ ట్వీట్ చేస్తూ.. ‘‘డియర్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం లడ్డూ వివాదం జరుగుతున్న రాష్ట్రంలోనే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దయచేసి విచారణ జరపండి. ఈ విషయంలో తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించండి. అంతేకానీ, మీరు ప్రజలలో భయాందోళనలను పెంచి, దీన్నో జాతీయ స్థాయి సమస్యగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మనదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు చాలానే ఉన్నాయి (కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు. ఇక్కడ ప్రకాశ్ రాజ్ ఉద్దేశ్యం.. ‘‘లడ్డూ విషయంలో జరిగిన తప్పును కనుక్కుని, ఆ తప్పు చేసిన వారిని శిక్షించండి. అంతేకానీ, దీనిని ఓ జాతీయ సమస్యగా చిత్రీకరించి, సనాతన ధర్మరక్షణ బోర్డు అంటూ విషయాన్ని సైడ్ ట్రాక్‌లోకి తీసుకెళ్లకండి. ఇప్పటికే మతపరమైన ఎన్నో సమస్యలు భారత్‌లో ఉన్నాయి. మీరు మరో సమస్యని సృష్టించకండి’’ అని చెప్పడం.
తిరుమల లడ్డూ వివాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన వాఖ్యలకు మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా.. ‘‘ప్రకాశ్‌రాజ్‌గారూ.. దయచేసి మీరు అంతలా అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు.. నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణ నిమిత్తం ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌గారు సరిగ్గానే పిలుపునిచ్చారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే.. మతం ఏ రంగు పులుముకుంటుందో? మీ పరిధుల్లో మీరు ఉంటే మంచిది’’ కౌంటర్ వేశారు. మంచు విష్ణు స్పందనకు ప్రకాశ్ రాజ్ ప్రతిస్పందిస్తూ.. ‘‘సరే శివయ్యా.. నా అభిప్రాయం నాకు ఉంది.. నీ అభిప్రాయం నీకు ఉంది.. అర్థమైంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఇదంతా చూస్తున్నవారు.. మళ్లీ వీరిద్దరి మధ్య వార్ మొదలయ్యిందిరో.. అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.
Also Read- Tirupati Controversy: లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్
Also Read- ANR100: ఏఎన్నార్‌ను స్మరించుకున్న చిరు, బాలయ్య
Also Read- Jani Master: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. రిమాండ్ రిపోర్ట్ ఇదే
Read Latest Cinema News