Devara VS Kalki: దేవర VS కల్కి..  పై చేయి ఎవరిదంటే..

ABN, Publish Date - Sep 24 , 2024 | 01:17 PM

జూనియర్ ఎన్టీయార్ దేవర (Devara) రిలీజ్‌కు ముందే ఏదో  విధంగా చర్చకి దారి తీస్తోనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో దేవర వర్సెస్ కల్కి (Devara Vs kalki) అనే చర్చ విపరీతంగా జరుగుతోంది.

జూనియర్ ఎన్టీయార్ దేవర (Devara) రిలీజ్‌కు ముందే ఏదో  విధంగా చర్చకి దారి తీస్తోనే ఉంది. తాజాగా సోషల్ మీడియాలో దేవర వర్సెస్ కల్కి (Devara Vs kalki) అనే చర్చ విపరీతంగా జరుగుతోంది. రిలీజ్‌కు రెండు రోజుల ముందు ఏం చర్చ అనుకుంటున్నారా ?  అదే టికెట్ బుకింగ్ (Ticket booking records) రికార్డ్స్ విషయంలో. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' టికెట్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్‌కి లైన్ క్లియరైనా సమయంలో  ఫ్యాన్  సరికొత్త చర్చను తెరపైకి తీసుకు వచ్చారు. అదే బుక్ మై షో టికెట్స్ బుకింగ్ అనలిటిక్స్. ఈ సైట్‌లో ప్రభాస్ 'కల్కి 2898 AD' విడుదలకు మూడు రోజుల ముందు 3,30,000 వేల అమ్ముడు పోగా గంటకి 15 వేల 420 టికెట్లు అమ్మడయ్యాయి. అలాగే వన్ మిలియన్ యూజర్స్ ఇంట్రెస్ట్ చూరగొంది. 

'దేవర' విషయానికి వస్తే ఒక లక్ష ఆరు వేల టికెట్లు అమ్మితే గంటకి 3 వేల 780 టికెట్ల అమ్మకాలు క్రియేట్ చేస్తోంది. కాగా, దేవరకి 772.3K యూజర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో ప్రభాస్, తారక్ అభిమానుల మధ్య రచ్చ షురూ అయ్యింది. అంతేకాకుండా ప్రభాస్ 'సలార్' మూవీ కూడా రిలీజ్‌కు ముందే 82 వేల టికెట్లు(తెలుగు రాష్ట్రాలు మినహాయించి) సేల్ చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా హంగామా సృష్టిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా బాగుండి అభిమానులు అనవసర రాద్ధాంతాలకు వెళ్లకపోతే మంచిదని మరికొందరు సూచిస్తున్నారు.

Updated Date - Sep 24 , 2024 | 01:17 PM