మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Family Star: ‘దేవర’ డేట్‌కే ఫిక్సయిన ‘ఫ్యామిలీ స్టార్’.. అయోమయంలో తారక్ ఫ్యాన్స్‌

ABN, Publish Date - Feb 02 , 2024 | 06:05 PM

రీసెంట్‌గా జరిగిన మీడియా సమావేశంలో ‘దేవర’ సినిమా వాయిదా పడితే మాత్రం.. ఆ డేట్‌కి మేము నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని విడుదల చేస్తామని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి నిజంగానే ‘దేవర’ వాయిదా పడుతుందేమో తెలియదు కానీ.. దిల్ రాజు మాత్రం ‘ఫ్యామిలీ స్టార్’ విడుదలను ఆ డేట్‌కే (ఏప్రిల్ 5) ఫిక్స్ చేసి.. అధికారికంగా ప్రకటించేశారు.

Devara and Family Star Movie Stills

రీసెంట్‌గా జరిగిన మీడియా సమావేశంలో ‘దేవర’ (Devara) సినిమా వాయిదా పడితే మాత్రం.. ఆ డేట్‌కి మేము నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రాన్ని విడుదల చేస్తామని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. మరి నిజంగానే ‘దేవర’ వాయిదా పడుతుందేమో తెలియదు కానీ.. దిల్ రాజు (Dil Raju) మాత్రం ‘ఫ్యామిలీ స్టార్’ విడుదలను ఆ డేట్‌కే ఫిక్స్ చేశారు. విడుదల తేదీతో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో తారక్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. ఎందుకంటే, వేసవికి ఈ సినిమా పక్కాగా ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. కొరటాల కూడా పార్ట్ 1 అదే డేట్‌కి వస్తుందని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. మరి ఇప్పుడేమైందో తెలియందు.. ఈ ‘ఫ్యామిలీ స్టార్’ విడుదల తేదీ ప్రకటన రాగానే.. ఒక్కసారిగా తారక్ ఫ్యాన్స్‌లో నిరుత్సాహం ఆవహిస్తోంది. (Family Star Movie Release Date)

‘ఫ్యామిలీ స్టార్’ విషయానికి వస్తే.. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా‌ను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్‌గా వెల్లడించారు. హోల్ సమ్ ఎంటర్‌టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. రీసెంట్ ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్.. వైరల్ అవడమే కాకుండా.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. (Family Star Movie Details)


తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌లా కనిపిస్తున్నారు. లుంగీ కట్టుకుని గన్నీ బ్యాగ్, ఆధార్ కార్డ్‌తో విజయ్ నడిచి వస్తున్న పోస్టర్ చూడగానే.. ఈ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా ఎంటర్‌టైన్ చేయబోతున్నారనేది అర్థమవుతోంది. ఇంతకు ముందు విజయ్, పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీత గోవిందం’ ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ సినిమాను మించే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అలాగే సక్సెస్‌ను ఈ సినిమా అందుకుంటుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై మంచు మోహన్ బాబు స్పందనిదే..

*************************

*Bubblegum: సుమ తనయుడి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..

**************************

Updated Date - Feb 02 , 2024 | 06:05 PM