మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tollywood: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకి పరిశ్రమ నుంచి అభినందనల వెల్లువ

ABN, Publish Date - Jun 04 , 2024 | 06:51 PM

మునుపెన్నడూ లేనంతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి నటీనటులు, పరిశ్రమకి సంబందించిన సంస్థలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అభినందనలు కురిపించారు

Pawan Kalyan and Chandrababu Naidu

మునుపెన్నడూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం, మిత్ర పక్షాలైన బీజేపీ, జనసేన కలిపి చారిత్రాత్మక విజయం నమోదు చేసుకున్నాయి. 175 స్థానాలున్న అసెంబ్లీలో మిత్ర పక్షాల కూటమి 165 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. ఇది నిజంగా ఒక రికార్డు అని చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంటు స్థానాల్లో నూటికి నూరు శాతం గెలిచి ఇంకొక రికార్డు నెలకొల్పింది.

అధికార పక్షంలో వున్న పార్టీ ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోవటం బహుశా ఇదే మొదటిసారేమో అని ఒక చర్చ నడుస్తోంది. ప్రపంచంలో ఈసారి లక్షలమంది ఆసక్తిగా ఎదురు చూసిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షం కేవలం 10 స్థానాలకే పరిమితం అవటం నిజంగా ఘోర పరాజయం అనే చెప్పాలి.

అలాగే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి చిత్ర పరిశ్రమ నుండి ఎంతోమంది తెలుగు దేశం, జనసేన, బీజేపీ గెలుపుపై అభినందనల వెల్లువలు పోటెత్తాయి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్సు, ఇంకా ఎంతోమంది నటీనటులు తమ సంతోషాన్ని, అభిననందలను తెలియచేసారు. కూటమికి, అలాగే పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణలకి వ్యక్తిగతంగా కూడా అందరూ శుభాకాంక్షలు తెలియచేశారు.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి, చంద్రబాబుకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఎంతోమంది నటీనటులు పరిశ్రమనుండి తమ స్పందన తెలియచేశారు.

Updated Date - Jun 04 , 2024 | 06:51 PM