Ananya Krishnan:సత్య కృష్ణన్ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా..

ABN, Publish Date - Oct 21 , 2024 | 05:04 PM

టాలీవుడ్‌కి కొత్త అందం పరిచయం కాబోతుంది.. కొత్త అందమే కాదు.. తెలుగు అందం కూడా. ఇంతకీ ఎవరీ బ్యూటీ? కొరియన్‌ భామలా ఉందంటున్న ఈ కథానాయిక ఎవరు, నేపథ్యం ఏంటి? తెలుసుకోవాలనుందా..

టాలీవుడ్‌కి కొత్త అందం పరిచయం కాబోతుంది..

కొత్త అందమే కాదు.. తెలుగు అందం కూడా.

ఇంతకీ ఎవరీ బ్యూటీ?

కొరియన్‌ భామలా ఉందంటున్న ఈ కథానాయిక ఎవరు?

నేపథ్యం ఏంటి? తెలుసుకోవాలనుందా?

ఈమె పేరు అనన్యా కృష్ణన్‌. టాలీవుడ్‌లో పేరొందిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు కుమార్తె.

సత్యకృష్ణన్‌ (Satya Krishnan) పరిచయం అక్కర్లేని తెలుగు నటి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'డాలర్‌ డ్రీమ్స్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, సహయ నటిగా ఎన్నో సినిమాల్లో తనదైన శైలితోపాటు, పెక్యులర్‌ వాయిస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఆనంద్‌', 'బొమ్మరిల్లు', 'రెడీ', 'దూకుడు', 'బాద్‌షా', 'గోవిందుడు అందరివాడేలే, 'పిల్ల నువ్వులేని జీవితం’, 'భలే భలే మగాడివోయ్‌’, 'ఆడవాళ్లు మీకు జోహర్లు' వంటి హిట్‌ చిత్రాల్లో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ మధ్యకాలంలో 'సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది.

ఇప్పుడు ఆమె కుమార్తె గురించి మీడియాలో ఎక్కువగా చర్చ నడుస్తోంది. ఆమె కూతురు అనన్యా కృష్ణన్‌ (Ananya Krishnan) టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇప్పటికే ఆమె 'గ్యాంగ్‌ స్టర్‌ గంగరాజు’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. రేలంగి నరసింహరావు దర్శకత్వం వహించిన 'ఊ అంటావా మావ ఊహు అంటావా మావ’ సినిమాలో మెరిసింది. ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. జబర్దస్త్‌ రాకేశ్‌ హీరోగా నటిస్తున్న కేసీఆర్‌ (కేశవ చంద్ర రమావత్‌-KCR) చిత్రంతో కథానాయికగా లాంచ్‌ అయింది.

ఇటీవల ట్రైలర్‌ లాంచ్‌ సమయంలో ఆమె మీడియా ముందుకొచ్చింది. తన అందం, క్యూట్‌ మాటలతో ఆకట్టుకుంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అనన్యకు టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఏమేరకు అవకాశాలు లభిస్తాయో చూడాలి. సోషల్‌ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. 

Updated Date - Oct 21 , 2024 | 05:39 PM