Rashmika Mandanna: ఈసారి కూడా దేవరకొండ ఇంట్లోనేనా..
ABN, Publish Date - Nov 01 , 2024 | 08:41 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తలో నిలిచారు. ఈ ఏడాదికి కూడా ఆమె దీపావళి పండుగను దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మరోసారి వార్తలో నిలిచారు. ఈ ఏడాదికి కూడా ఆమె దీపావళి పండుగను దేవరకొండ (Vijay Devarakonda) ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుందని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. పండుగ సందర్భంగా డిజైనర్ శ్రావ్యవర్మ (Sravya Varma) పోస్ట్ చేసిన ఫొటోలు దానికి కారణం. ఆమె విడివిడిగా షేర్ చేసిన ఫొటోల్లో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ తల్లి, ఇతర స్నేహితులు ఉన్నారు. విజయ్ షేర్ చేసిన ఫొటోలతోపాటు, శ్రావ్య షేర్ చేసిన ఫొటోల్లో అందరూ ఒకే కలర్ డ్రెస్‌లో కనిపించారు. దాంతో నెటిజన్లు అంతా రష్మిక ఈ సారి కూడా విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుందని పోస్ట్‌లు చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాంటి ఫొటోల వల్లే రష్మిక దొరికిపోయింది. విజయ్ ఇంట్లో ఫొటోలు దిగి ఆమె షేర్ చేసింది. అదే మెట్లపై దిగిన ఫోటోలను విజయ్, ఆనంద్ కూడా పోస్ట్ చేశారు. దాంతో రష్మిక వాళ్లింట్లోనే భారీగా దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుందని టాక్ నడిచింది. అయితే వాళ్ల ఇంట్లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు.. చాలా సందర్భాల్లో ఆమె కనిపించింది.
విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి రెండు చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనీ, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. అయితే ఈ విషయంపై ఇప్పటి దాకా ఇరువురు స్పందించలేదు. ఓ సారి విదేశాలకు టూర్‌కి వెళ్లి బీచ్‌లో దిగిన ఫొటోలను విడివిడిగా షేర్ చేశారు. నెటిజన్లు ఊరుకుంటారా? ఆ బీచ్ లొకేషన్, అక్కడి బ్యాగ్రౌండ్స్ గుర్తు పట్టి ఇద్దరూ వెళ్లింది ఒక చోటికే అని తేల్చేయడంతో ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని గాసిప్‌లకు బలం చేకూరింది. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇలాంటిదే జరిగింది. ఫ్లైట్ దిగి వేర్వేరు గేట్‌ల నుంచి బయటకు వచ్చినా ఫొటోగ్రాఫర్‌లకు ఓ ములన చిక్కేశారు. వీటిన్నింటి ఆధారంగా విజయ్ - రష్మిక ప్రేమలో ఉన్నారనే టాక్ వస్తూనే ఉంది. (Devarakonda Family)
పుష్ప, ఆనిమల్ చిత్రాలతో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పుష్ప 2: ది రూల్ సినిమాతో బీజీగా ఉంది. విజయ్ దేవరకొండ మాత్రం వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు.