RGV: ‘పుష్ప 2’ టికెట్ల ధరలపై వర్మ చెప్పిన ‘సుబ్బారావు ఇడ్లీలు’ స్టోరీ ఇదే

ABN, Publish Date - Dec 04 , 2024 | 01:31 PM

‘పుష్ప 2’ టికెట్ల ధరలపై కోర్టులో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ ధరలు సముచితమే అంటూ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ఓ ‘ఇడ్లీలు’ స్టోరీని పోస్ట్ చేశారు. ‘పుష్ప2’ టికెట్ల ధరకు సపోర్ట్ చేస్తూ.. వర్మ చెప్పిన కథ ఏమిటంటే..

Pushpa 2 Still and RGV

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప2’ చిత్రం ఇంకొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భారీ స్థాయిలో ధరలను పెంచుకునేందుకు అవకాశం ఇచ్చాయి. ప్రభుత్వం ఇచ్చిన ఈ అనుమతిపై, ‘పుష్ప 2’ టిక్కెట్ల ధరలపై కోర్టులలో కేసులు సైతం నమోదవుతున్నాయంటే.. టిక్కెట్ల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ టిక్కెట్ల ధరలకు వివాదస్పద దర్శకుడు వర్మ సపోర్ట్ ఇస్తూ ఎక్స్ వేదిగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ‘సుబ్బారావు ఇడ్లీలు’ అంటూ ఓ స్టోరీని ఆయన చెప్పుకొచ్చారు. ‘పుష్ప 2’ టికెట్ల ధరలను సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు కూడా వర్మకు అదే స్థాయిలో కౌంటర్స్ వేస్తున్నారు. ఇడ్లీ కథనే ఉదాహరణగా చెబుతూ.. తేడా కొడితే దుకాణం మూసుకోవాల్సి వస్తుంది.. అది కూడా కాస్త ఆలోచించుకోండి అంటూ కౌంటర్స్ సంధిస్తున్నారు. అసలు వర్మ చెప్పిన కథ ఏమిటంటే..

Also Read- Daaku Maharaaj: గాడ్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్‌‌కు గుడ్ న్యూస్.. ఏమిటంటే..



‘‘పుష్ప 2 ఇడ్లీలు’’

సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.

కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.

“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే, అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం

ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే

డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.

Also Read-Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా


అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు?

ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?

ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?

అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే.

అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ, లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా?

మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది.. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!


Also Read-Dushara Vijayan: అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు

Also Read-SS Rajamouli: ఆ ఒక్క సీన్‌తో సినిమా ఏంటో అర్థమైపోయింది


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 04 , 2024 | 02:19 PM