Upasana: సెకండ్.. ప్రెగ్నెన్సీకి కూడా రెడీ
ABN, Publish Date - Feb 22 , 2024 | 04:58 PM
ఉపాసన.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారుండరు. ఓ వైపు అపోలో ఆస్పత్రి బాధ్యతలను చూసుకుంటూనే ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ తన వంతు సహాయ సాకారాలు అందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్ సంతోష పడే విషయం తెలిపింది.
ఉపాసన.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారుండరు. చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్యగా కాకుండా తన స్వశక్తితో సామాజిక కార్యక్రమాల ద్వారా చాలా మంది ప్రజలకు చేరువయింది. ఓ వైపు అపోలో ఆస్పత్రి బాధ్యతలను చూసుకుంటూనే ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ తన వంతు సహాయ సాకారాలు అందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. దాదాపు పదకొండేండ్ల క్రితం వివాహంతో ఒకటైన రామ్ చరణ్ (Ram Charan) ఉపాసన (Upasana Konidela) జంట గత సంవత్సరం బిడ్డ (క్లింకారా)కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్ సంతోష పడే విషయం తెలిపింది.
ఆపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో.. ప్రస్తుతం మహిళలు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉపాసన (Upasana Konidela)మాట్లాడుతూ.. ఈ తరం మహిళలు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగురతతో ఉండాలని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కోరింది. భార్యాభర్తలు నిరంతరం ఓకరికొకరు గౌరవించుకుంటూ తమ హెల్త్ విషయాల్లో ఓపెన్ గా ఉండాలని తద్వారా తమ పిల్లల భవిష్యత్తును తీర్చుదిద్దుకోవచ్చని తెలిపింది. ఓ సందర్భంలో నేను పిల్లలను కనే విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నానని ఈ విషయంలో నాకెలాంటి బాధ లేదని చెప్పుకొచ్చింది. చరణ్ (Ram Charan), నేను మాట్లాడుకుని పిల్లలను ఆలస్యంగా కనాలని నిర్ణయించుకున్నామన్నారు.
మన ఆరోగ్యం మీద మనకే శ్రద్ధ ఉండాలని.. అవతలి వారిపై అధారపడొద్దని తెలిపింది. అంతేగాక త్వరలోనే మేము మరోబిడ్డని ప్లాన్ చేస్తున్నామని, సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఏడాది చివరి వరకు ఉపాసన (Upasana Konidela) మరో శుభవార్త చెబుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఱెండో రౌండ్ కు కూడా రెడీ అంటూ ఉపాసన ఇన్ స్టాలో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.