Rajinikanth: రజనీ హెల్త్‌పై అపోలో హెల్త్ బులిటెన్..
ABN, Publish Date - Oct 01 , 2024 | 05:51 PM
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఆరోగ్య పరిస్థితిపై కంగారు పడుతున్న ఫ్యాన్స్‌కి అపోలో(Apollo) యాజమాన్యం గుడ్ న్యూస్ తెలిపింది.
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఆరోగ్య పరిస్థితిపై కంగారు పడుతున్న ఫ్యాన్స్‌కి అపోలో(Apollo) యాజమాన్యం గుడ్ న్యూస్ తెలిపింది. ఆయన శ్రేయోభిలాషులు మరియు అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో యాజమాన్యం రజనీ హెల్త్‌పై బులిటెన్ విడుదల చేసింది. ఆరోగ్యంలో స్వల్ప అస్వస్థత రావడంతో రజనీ సోమవారం చెన్నై గ్రీమ్స్ రోడ్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో చేరారు. ఆయన హృదయం నుండి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని డాక్టర్లు తెలిపారు. దీనికి శస్త్రచికిత్స కానటువంటి ట్రాన్స్‌కాథెటర్(Transcatheter) పద్ధతి ద్వారా చికిత్స అందిస్తునట్లు డాక్టర్లు తెలిపారు. ఈ చికిత్సను సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్(Interventional Cardiologist) డాక్టర్ సాయి సతీష్ దగ్గరుండి జరిపిస్తున్నారు. ఆయన రక్తనాళంలో వచ్చిన వాపుకి స్టెంట్ వేసినట్లు తెలిపారు. అలాగే ఎండోవాస్కులర్ రిపేర్(Endovascular repair) ప్రణాళికాబద్ధంగా సాగిందని ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మరో రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.
రజినీ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులంతా ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ అక్టోబర్ 10న విడుదలకానుంది. ఇటీవల జరిగిన సినిమా ఆడియో వేడుకలో రజనీ పాల్గొన్నారు. అనిరుధ్‌తో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు.