Raashii Khanna: పుట్టినరోజున రాశీఖన్నా ఏం చేసిందంటే..
ABN, Publish Date - Dec 01 , 2024 | 10:40 AM
పుట్టినరోజు స్పెషల్‌గా రాశీఖన్నా గత నాలుగు సంవత్సరాలుగా ఏమైతే చేస్తుందో.. అదే ఈ సంవత్సరం కూడా చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
తనకు విపరీతమైన దైవభక్తి అని ప్రముఖ హీరోయిన్ రాశీఖన్నా (Raashii Khanna) అన్నారు. తెలుగులో ‘బెంగాల్ టైగర్’, ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’, ‘సుప్రీమ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాలలోనూ.. కోలీవుడ్ ‘ఇమైకా నొడిగల్, ’సర్దార్’, ‘అరణ్మనై-4’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన రాశీఖన్నా.. ప్రస్తుతం హిందీ భాషా చిత్రాల్లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో ‘సబర్మతి రిపోర్ట్’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ గ్లామర్ ఫొటోలతో సందడి చేస్తుంటుందీ బబ్లీ బ్యూటీ.
Also Read-Rashmika Mandanna: దేనికైనా ఓ హద్దుంటుంది.. మితిమీరితే ఊరుకోను
నవంబరు 30న తన వయసుని మరో సంవత్సరం పెంచుకున్న ఈ భామ మాట్లాడుతూ.. ‘నేను నటించిన అన్ని భాషలలోని చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ముఖ్యంగా ‘సబర్మతి రిపోర్ట్’ మూవీలో నా నటనకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిల నుండి ప్రశంసలు రావడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఇది నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నా పుట్టిన రోజు సందర్భంగా గత నాలుగేళ్ళుగా మొక్కలను నాటుతున్నాను. ఈ పుట్టిన రోజు కూడా వారణాసిలో మొక్కలు నాటాను. నాలో లోతైన భక్తి భావాలున్నాయి. దేవుడిని ప్రార్థించడం ఎంతో ఇష్టం. గత పదేళ్ళుగా దైవభక్తిలో మునిగిపోయానని చెప్పుకొచ్చిందీ చిన్నది. (Heroine Raashii Khanna)
ప్రస్తుతం రాశీఖన్నాకు టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రావడం లేదు. ఒకటి, రెండు సినిమాలు తప్పితే ఆమెకు అవకాశాలు అంతగా లేవనే చెప్పుకోవాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేసిన ‘జై లవ కుశ’ సినిమా తర్వాత ఆమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తాయని అంతా భావించారు. ఆమె కూడా అదే అనుకుంది. కానీ అది జరగలేదు. తన అందంతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లాల్సిన రాశీఖన్నా.. ప్రస్తుతం అవకాశాల కోసం వేచి చూస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో మాత్రం ఆమె వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.
Also Read- Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
Also Read-Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
Also Read-Prashanth Varma: సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. గెట్ రెడీ ఫర్ 'మోక్షజ్ఞ'
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి