E Tv Serial: ప్రమోషన్‌తో పాటు సందేశం.. ఈ ఛానల్ రూటే సపరేటు! అదిరిందిగా ఐడియా
ABN, Publish Date - Apr 05 , 2024 | 11:16 AM
చెడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుంచి తనని తాను కాపాడుకోవాలంటూ సందేశం ఇవ్వడంతో పాటు తమ సీరియల్ ప్రమోషన్‌ను వినూత్నంగా చేసింది ఓ టీవీ ఛానల్.
మన సమాజంలో ప్రతి చిన్నారికి సురక్షితంగా, ఆనందంగా పెరగడం ఎంతో ముఖ్యం. చిన్నారి సురక్షితంగా ఉండాలంటే, సమాజంలోని కొందరు చెడు ఆలోచనలు వున్న వ్యక్తులనుంచి తనని తాను కాపాడుకోవాలి. తననితాను కాపాడుకోవాలంటే, ముందు ఆ వ్యక్తుల చెడు ఆలోచనలని పసిగట్టే అవగాహన చిన్నారులకి అవసరం.
ఆ అవగాహన చిన్నారులలో కల్పించాలన్న లక్ష్యంతో గుడ్ బాడ్ టచ్ అవగాహనా కార్యక్రమాన్ని ఈటీవీ (ETV Telugu) నిర్వహిస్తోంది. టీవీ సీరియల్స్ అనేవి, కేవలం వినోదం కోసమే కాదు, వాటి ద్వారా సామాజిక సేవ కూడా చేయాలనే మహోన్నతమైన సందేశాన్ని ఈటీవీ సమాజానికి అందిస్తోంది. దీంతో టీవీ సీరియల్‌కు ప్రమోషన్‌తో జరగడంతో పాటు పబ్లిక్ మంచి సందేశం ఇస్తున్నారు.. ఈ ఛానల్ రూటే సపరేటు! అదిరిందిగా ఐడియా అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఈటీవీ (ETV Telugu) లో ప్రతి రోజూ రాత్రి 8గంటలకి ప్రసారమవుతున్న ‘గువ్వ గోరింక’ (#GuvvaGorinka ) సీరియల్ ద్వారా ఆ సీరియల్ నటీనటులచే గుడ్, బాడ్ టచ్ లపై చిన్నారులకి అర్థమయ్యేలా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో టచ్ చేస్తున్నాడో ఎలా తెలుసుకోవాలో ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈటీవీ క్రియేటివ్ టీమ్, మరియు ఈటీవీ (ETV Telugu) సీరియల్ ‘గువ్వగోరింక’ (#GuvvaGorinka ) నటీనట బృందం ప్రతి పాఠశాల విద్యార్థినికీ ఈ సందేశం అందేలా కృషి చేయడం పేర్కొనదగిన అంశం. దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ త్వరలో ఈ సీరియల్‌లో టెలికాస్ట్ కానున్నాయి.