Guntur Kaaram: ‘కీర్తికిరీటాలు’ నవలతో ‘గుంటూరు కారం’ పోలిక.. నాగవంశీ రియాక్షన్ ఇదే..
ABN, Publish Date - Jan 07 , 2024 | 06:23 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాపై ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ‘కీర్తికిరిటాలు’ నవల నుండి త్రివిక్రమ్ స్ఫూర్తి పొందినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
సంక్రాంతి వచ్చేస్తోంది. పల్లెలు, పట్టణాలు పండగ వాతావరణాన్ని సంతరించుకొంటుంటే.. కొత్త చిత్రాల విడుదలకు థియేటర్లు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలానే ఈసారి కూడా మహేష్, వెంకటేష్, నాగార్జున తదితర పెద్ద హీరోల సినిమాలతో పాటు తేజ సజ్జా నటించిన పాన్ వరల్డ్ చిత్రం ‘హను-మాన్’ సంక్రాంతి బరిలో పోటీపడుతున్నాయి. అదే సమయంలో చిన్న చిన్న వివాదాలూ చెలరేగుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాపై ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ‘కీర్తికిరిటాలు’ నవల నుండి త్రివిక్రమ్ స్ఫూర్తి పొందినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
‘‘మాకు సోషల్ మీడియాతో ఎటువంటి సమస్య లేదు. అభిమానులు, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. అయితే కొందరు పనిగట్టుకొని ఫేక్ న్యూస్‌ను క్రియేట్ చేస్తున్నారు. మహేష్, త్రివిక్రమ్ సినిమా అనే సరికి అంచనాలు భారీగా ఉంటాయి. ఎక్కువమంది చదువుతారు. వ్యూస్ పెరుగుతాయి. ఈ వార్తలకు స్పందిస్తే... అవి నిజమనుకుంటారు. లేకపోతే హంగామా చెలరేగుతుంది. ఉదాహరణకు పూజా హెగ్డేకు తేదీలు కుదరలేదు. దాంతో ప్రాజెక్టు నుంచి వైదొలగారు. అదే విధంగా సినిమాటోగ్రాఫర్ వినోద్‌గారు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల పని చేయలేకపోయారు. ఇవి తప్ప మిగిలినవన్నీ అబద్ధాలే! కొందరు ‘హీరోకు... డైరెక్టర్‌కు పడలేదని’... ‘కథ కాపీ’ అని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటలు చూస్తే... మహేష్ గారు ఈ ప్రాజెక్టులో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో తెలుస్తుంది.
త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్‌లో 12 సంవత్సరాల తర్వాత సినిమా వస్తోందని ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు. మాది అచ్చమైన తెలుగు సినిమా. మహేష్ గారిని చూడటానికి రెండు కళ్లూ చాలవు. త్రివిక్రమ్ గారి పెన్ అద్భుతం. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అన్ని రుచులూ ఉన్న పెద్ద విందును అందిస్తున్నాం. ఇక ఈ సినిమా నిర్మాణంలో మహేష్‌గారు అందించిన సహకారం అద్భుతం. ఆయనతో అన్ని విషయాలూ స్వేచ్ఛగా చెప్పగలుగుతాం. అయితే.. ఈ పోటీలో కొందరు మాపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటిదే ‘కీర్తికిరిటాలు’ నవలతో పోలిక. నేను ఆ నవల చదవలేదు. నేను ఈ వార్తలు సోషల్ మీడియాలో రావటం మొదలుపెట్టిన తర్వాత బాబాయ్ (‘హారిక-హాసిని క్రియేషన్స్’ రాధాకృష్ణ)ను అడిగాను. ‘‘దానికి... దీనికి అసలు సంబంధం లేదురా’’ అన్నాడు బాబాయ్..’’ అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
====================
*కెప్టెన్ నివాసానికి క్యూకడుతున్న సినీ ప్రముఖులు.. ఇప్పుడెందుకు వస్తున్నారంటూ..?
*************************
*Anjali: ముద్దుగా కనిపించినా.. నా పనులు అలా ఉంటాయి
***********************
*Director Vijay Binni: ‘నా సామిరంగ’లో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయ్..
**************************
*RC16: ఆయనే.. అధికారికంగా ప్రకటించేశారు
***********************