మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Baby Leaks: ‘బేబి’ కథ నాది.. సాయిరాజేష్ మోసం చేశాడు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - May 25 , 2024 | 05:42 PM

తన కథను కాపీ కొట్టి ‘బేబి’గా తీయడం మీద మరోసారి స్పందించాడు దర్శకుడు శిరిన్ శ్రీరామ్. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో ఆయన తీసుకొచ్చారు. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. ఈ మూవీ మీడియా సమావేశంలో బేబి లీక్స్‌ని ఆయన రివీల్ చేశారు.

Preminchoddu Movie Team

తన కథను కాపీ కొట్టి ‘బేబి’ (Baby)గా తీయడం మీద మరోసారి స్పందించాడు దర్శకుడు శిరిన్ శ్రీరామ్ (Sirin Sriram). సాయి రాజేష్ (Sai Rajesh) చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ (Baby Leaks) అంటూ పుస్తకరూపంలో ఆయన తీసుకొచ్చారు. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’ (Preminchoddu). శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడం మీద మరోసారి స్పందిస్తూ.. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ (Baby Leaks Book) అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చి.. మీడియా ముందుంచారు.

*Love Me Movie Review: వైష్ణవి చైతన్య, ఆశిష్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే...


ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో శిరీన్ శ్రీరామ్ (Sirin Sriram) మాట్లాడుతూ.. ‘‘రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తర్వాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నాను. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేష్‌తో ఏడాది ప్రయాణం చేశాను. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి, ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశాను. అప్పుడు మాకేం గొడవ జరగలేదు. త‌ర్వాత నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇస్తాన‌న్న‌వాడు.. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే ఓ బూతు సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేష్ గారిని కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. ‘హృదయ కాలేయం’ సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చాను. సాయం చేసిన వాళ్లకే వెన్నుపోటు పొడిచే రకం. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేస్ ఫైల్ చేశాను. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశాడు. ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశాను. దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడీ బుక్ పీడీఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. నేను కామ్‌గా నా పని నేను చేసుకుంటుంటే.. సాయి రాజేష్ గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాడు..’’ అని చెప్పుకొచ్చారు.


రవి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘పోలీసులు, కోర్టు, మీడియా వల్ల న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. 2012 నుంచి శిరీన్‌తో నాకు పరిచయం. అన్నపూర్ణలో డైరెక్షన్ కోర్సు చేశాను. 2015లో పేపర్ ఆర్టికల్ చూసి పోస్ట్ చేశా. ఆ చిన్న ఆర్టికల్‌ను చూసి శిరీన్ కాల్ చేశాడు. స్టోరీగా మార్చి సినిమా తీద్దామని అన్నాడు. అమ్మాయి ఇద్దర్ని ప్రేమించింది.. ఆ ఇద్దరూ కలిసి అమ్మాయిని చంపే ప్రయత్నం చేస్తారు అనే పాయింట్‌తో కథను రాసుకున్నాడు. స్కూల్ ఏజ్ అమ్మాయి అయితే బాగుంటుందని ఆ స్టోరీని అలా అల్లుకున్నాడు. అబ్బాయిల్లో ఒకరు రిచ్, ఒకరు పూర్ అయితే బాగుంటుందని శిరీన్ ఆ రోజే నాకు చెప్పాడు. నేను లై డిటెక్షన్‌కు సిద్దం.. సాయి రాజేష్ సిద్దమా?.. నేను సాయి రాజేష్‌ని పదేళ్ల క్రితమే బ్లాక్ చేశా. జూన్ 7న ‘ప్రేమించొద్దు’ రాబోతోంది. శిరీన్ డ్రీమ్‌ను సాయి రాజేష్ నాశనం చేశాడు. మీడియానే న్యాయం చేయాలి’’ అని అన్నారు.

లాయర్ నిఖిలేష్ తొగరి మాట్లాడుతూ.. ఫేస్ బుక్ ద్వారా శిరీన్ పరిచయం. ఆయన తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను. ఒకసారి ఆయన ఫోన్ చేసి ఈ బేబీ కాపీ గురించి చెప్పాడు. సాక్ష్యం ఎలా పట్టుకొస్తావ్ అని అడిగితే.. ప్రతీ దాన్ని డేట్‌తో సహా భద్రపర్చుకున్నాడు. ఇవన్నీ చూసి షాక్ అయ్యాను. ఇంత పకడ్బందీగా దాచుకోవడం ఆశ్చర్యమేసింది. ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు ఇష్టం. క్రియేటివ్ పర్సన్‌కు ఇలా జరగడం బాధగా ఉంది. పోలీసులు కూడా ఈ సాక్ష్యాలు చూసి షాక్ అయ్యారు. చీటింగ్, క్రిమినల్ కాన్‌స్పిర‌సీ, కాపీ రైట్ యాక్ట్‌కి సంబంధించిన ప‌లు సెక్ష‌న్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శిరీన్ తన ప్రమోషన్స్‌లో తాను ఉంటే ఛాంబర్లకు లేఖలు రాస్తున్నారట. అందుకే ఇలా మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాలను బుక్ రూపంలో తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాడని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - May 25 , 2024 | 05:43 PM