Prakash Raj: పైనుంచి ఆదేశాలు అందాయా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్రకాష్‌రాజ్ మ‌రో ట్వీట్‌

ABN, Publish Date - Oct 06 , 2024 | 09:37 PM

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న ట్వీట్ల వార్ ఆగ‌ని రావ‌ణ కాస్టంలా ఆప్ర‌తిహాతంగా కొన‌సాగుతూనే ఉంది.

prakash raj

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj), ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ల మ‌ధ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న ట్వీట్ల వార్ ఆగ‌ని రావ‌ణ కాస్టంలా ఆప్ర‌తిహాతంగా కొన‌సాగుతూనే ఉంది. ఇప్పటికే వరుస ట్వీట్లతో విన్నవింపులు, విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్ మరోసారి పరోక్షంగా పవన్‌కి చురకలు అంటించాడు. తిరుపతి లడ్డు వివాదంతో వీరిద్దరి మ‌ధ్య‌ ప్రారంభ‌మైన ఈ పంచాయితీ ఇప్పట్లో అయితే ముగిసేలా క‌నిపించ‌డం లేదు. మరోవైపు ప్రకాష్ రాజ్‌పై పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నా సరే జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ త‌నదైన శైలిలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూనే ఉన్నాడు.

రెండు రోజుల క్రితం శుక్ర‌వారం రోజున "స‌నాత‌న ధ‌ర్మ ర‌క్ష‌ణ‌లో మీరుండండి. స‌మాజ ర‌క్ష‌ణ‌లో మేముంటాం. జ‌స్ట్ ఆస్కింగ్‌. All the Best #justasking" అంటూ మరో ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వ‌హించిన స‌భ‌లో తమిళనాడు డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్‌( Udhayanidhi Stalin)పై ప‌రోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ ఈవెంట్‌లో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉద‌య‌నిది స్టాలిన్ హ‌జ‌ర‌వ్వ‌గా వారితో క‌లిసి దిగిన ఫొటోను ప్ర‌కాశ్ రాజ్ నిన్న (శ‌నివారం) త‌న ట్విట్ట‌ర్‌లో 'విత్ ఏ డిప్యూటీ సీఎం' అనే క్యాప్షన్ తో షేర్ చేయ‌గా బాగా వైర‌ల్ అయింది.


ఇదిలాఉండ‌గానే ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిన్న శ‌నివారం త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ఎమ్జీఆర్ సేవ‌ల‌ను గుర్తు చేస్తూ ఓ పోస్టు పెట్టాడు. తాజాగా ఈ రోజు ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj) ఆ పోస్టుపై స్పందింస్తూ.. ఈ రోజు (ఆదివారం) కౌంట‌ర్ ఇచ్చారు. MGRపై హ‌ఠాత్తుగా ఎందుకింత‌ ప్రేమో.. పైనుంచి ఆదేశాలు ఏమైనా అందాయా.. జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ఠు పెట్టారు. ఇప్పుడు ఈ పోస్టు సోష‌ల్‌మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ల వార్ ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో.. మున్ముందు ఎలా ఇది మ‌లుపు తిరుగుతుందో.. ఎక్క‌డికి దారి తీస్తుందో అంటూ నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు.

Updated Date - Oct 06 , 2024 | 09:37 PM