Prabhas: తెలంగాణ ప్రభుత్వానికి రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్
ABN, Publish Date - Dec 31 , 2024 | 07:11 PM
లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉండగా.. అవి మనకి అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రభాస్ ఏం చెప్పారంటే..
సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ విషయం ఎప్పటికి ఎన్నో సార్లు నిరూపితమైంది. ఇటీవల వరదలు సంభవించినప్పుడు కూడా ప్రభాస్, రెండు తెలుగు రాష్ట్రాలకు భూరి విరాళం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ కార్యక్రమానికి తన మద్దతు ప్రకటించారు ప్రభాస్. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తూ డ్రగ్స్ వద్దు అనే సందేశంతో ఓ వీడియోను విడుదల చేశారు ప్రభాస్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ..
Also Read- Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..
‘‘లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనషులు, మన కోసం బతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్‌ను ఈ రోజు నుంచే వదిలేయండి. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రభాస్ ముందుకు రావడంతో అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ప్రేక్షకులు ఆయనను అభినందిస్తున్నారు.
ఇదే క్యాంపెయిన్‌లో హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీలీల వంటి వారు కూడా ఇప్పటికే వీడియోలు విడుదల చేసి ఉన్నారు. అంతకు ముందు స్టార్ హీరోలు తమ సినిమాల విడుదల సమయంలో కూడా ఇలాగే కొన్ని అవేర్‌నెస్ వీడియోలను విడుదల చేశారు. రీసెంట్‌గా సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశంలో కూడా సీఎం ఇదే కోరారు. హీరోహీరోయిన్లు అందరూ తెలంగాణ రాష్ట్రం కోసం ఇలాంటి అవేర్‌నెస్ కార్యక్రమాలు చేయాలని కోరారు. ఆయన కోరిక మేరక సెలబ్రిటీలందరూ ఇలా ముందుకు వస్తుండటం అభినందనీయం.