Salaar: సలార్.. సినిమా మొత్తంలో ప్రభాస్ మాట్లాడింది ఎన్ని నిమిషాలంటే!
ABN, Publish Date - Jan 21 , 2024 | 03:54 PM
గత డిసెంబర్లో విడుదలైన ప్రభాస్ సలార్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత హంగామా సృష్టించిందో తెలిసిందే. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను అభిమానులు ఒకటికి రెండు సార్లు చూస్తు ప్రభాస్‌పై ఇన్ని డైలాగ్స్, ఇన్ని కట్లు ఉన్నాయంటు లెక్కలు చెబుతూ హీరోపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
గత డిసెంబర్ 22న విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ (Salaar) రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంత హంగామా సృష్టించిందో తెలిసిందే. రిలీజైన మొదటి షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు లైన్ కట్టారు. దీనికి పోటీగా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ, హాలీవుడ్ చిత్రం ఆక్వామెన్ వచ్చినప్పటికీ సలార్ ముందు అవి అంతగా ప్రభావం చూపలేక పోయాయి. దీంతో ఈ సినిమా రికార్డుల దుమ్ము దులిపింది. ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.
తాజాగా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్(Netflix )లోకి వచ్చిన సలార్ అక్కడా తన సత్తాను చాటుతూ అల్ అవర్ ఇండియా వ్యాప్తంగా నెంబర్ 1గా ట్రెండింగ్‌లో దూసుకెళుతుంది. ఈ సినిమా విడుదల సమయంలో బాలీవుడ్లో, తమిళనాట నెగిటివ్ ప్రచారం జరుగడంతో థియేటర్లలో సినిమా చూడని వారు ప్రస్తుతం ఓటీటీలో సినిమా చూసి రిగ్రేట్ ఫీలవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సినిమా థియేటర్లలో ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లను సాధిస్తున్నా వెంటనే ఓటీటీలో రిలీజ్ చేయడంపై అభిమానులు ఆగ్రహం చేస్తున్నప్పటికీ ఓటీటీలో ఒకటికి రెండు సార్లు చూస్తు సినిమాను, ప్రభాస్ నటనను, సినిమాలోని యాక్షన్ సీన్లను ఆస్వాదిస్తున్నారు.
అయితే 2 గంటల 55 నిమిషాల నిడివితో సాగే ఈ సినిమాలో మొత్తం కలుపుకుంటే రఫ్‌గా 4 నిమిషాలలోపే ప్రభాస్ (Prabhas) డైలాగ్స్ ఉన్నాయని మధ్యలో గ్యాప్స్ కూడా తొలగిస్తే మొత్తంగా 2.35 సెకండ్ల డైలాగ్స్ మాత్రమే ప్రభాస్‌కు ఉన్నట్లుగా అభిమానులు లెక్కలు వేసి చూయిస్తున్నారు. కేవలం ఆ కొద్ది డైలాగ్లలోనే ప్రభాస్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడని, ఇది ఒక ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైందంటూ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇంకా అభిమానులు అక్కడితో ఆగకుండా సినిమాలో ప్రభాస్ మీద 338 పైనే యాక్షన్ కట్స్ ఉన్నాయి, ప్రభాస్ (Prabhas) చెప్పిన డైలాగ్స్‌లో 78 లైన్లు ఉన్నాయంటు లెక్కలు చెబుతూ ప్రభాస్‌పైన తమకున్న అభిమానాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటున్నారు.