Pawan Kalyan: హీరో కార్తీ క్షమాపణలపై పవన్ కళ్యాణ్ స్పందనిదే..

ABN, Publish Date - Sep 24 , 2024 | 08:47 PM

‘సత్యం సుందరం’ సినిమా ఈవెంట్‌లో ‘లడ్డు’ విషయంపై కార్తీ మాట్లాడిన మాటలకు ఏపీ డిప్యూటీ సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే కార్తీ కూడా రియాక్ట్ అవుతూ.. క్షమాపణలు కోరారు. ఈ క్షమాపణలపై పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే..

Hero Karthi and AP Deputy CM Pawan Kalyan

‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) సినిమా ఈవెంట్‌లో ‘లడ్డు’ విషయంపై కార్తీ మాట్లాడిన మాటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) స్వీట్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘కుదిరితే మద్దతు పలకండి.. కానీ హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయవద్దు’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికకు వెంటనే కార్తీ కూడా ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయి.. క్షమాపణలు కోరారు. ‘‘నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను క్షమాపణ కోరుతున్నా. నేనూ వేంకటేశ్వరస్వామికి భక్తుడినే. ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను’’ అంటూ కార్తీ ఇచ్చిన సమాధానంతో ఇది ఇష్యూ కాకుండా నార్మల్‌గా సద్దుమణిగింది. కార్తీ స్పందనపై తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. వెంటనే స్పందించినందుకు అభినందించారు. అలాగే అక్కడ (సత్యం సుందరం వేడుకలో) మీ పరిస్థితిని అర్థం చేసుకున్నానని తెలుపుతూ.. ఇలాంటి విషయాలపై ఎప్పుడూ జాగ్రత్తగా స్పందించాలని తెలియజేశారు. (Hero Karthi)

Also Read- Kiraak RP: లడ్డు వివాదం.. వైఎస్ జగన్‌పై కిరాక్ ఆర్పీ సంచలన కామెంట్స్


‘‘డియర్ కార్తీ గారూ.. సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని.. అలాగే మీ వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తిరుపతి మరియు దాని గౌరవప్రదమైన లడ్డూతో పాటు.. మన పవిత్ర దేవాలయాలకు సంబంధించిన విషయాలు లక్షలాది మంది భక్తుల్లో లోతైన భావోద్వేగ భారాన్ని కలిగి ఉంటాయి. అలాంటి విషయాలపై జాగ్రత్తగా స్పందించటం మనందరికీ చాలా అవసరం. దీని వెనుక ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే మీరు ఇది కావాలని చేసిందిగా నేను భావించడం లేదు.. ఆ పరిస్థితిలో అనుకోకుండా అలా జరిగిపోయిందని నేను అర్థం చేసుకున్నాను. (Pawan Kalyan Response on Karthi Tweet)

Also Read- Hero Karthi పవన్‌ స్వీట్‌ వార్నింగ్‌కు కార్తి స్పందన


ప్రజలతో ఎక్కువగా మమేకమయ్యే మనలాంటి వారు బాధ్యత, ఐక్యత మరియు గౌరవాన్ని పెంపొందించడం.. ప్రత్యేకించి మనం ఎక్కువగా ఆరాధించే వాటి గురించి.. మన సంస్కృతి మరియు ఆధ్యాత్మిక విలువల విషయలో సినిమా ద్వారా స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం. అంకితభావం మరియు ప్రతిభ కలిగి ఉన్న గొప్ప నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను. మీకు.. సూర్య, జ్యోతిక గార్లకు.. మరియు 2D ఎంటర్‌టైన్‌మెంట్ టీమ్ మొత్తానికి నా అభినందనలు. మీ ‘సత్యం సుందరం’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌కు కార్తీ కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హీరో సూర్య కూడా ధన్యవాదాలు తెలిపారు.

Also Read- Pawan Vs Prakash Raj: పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్‌రాజ్‌ కౌంటర్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 24 , 2024 | 09:31 PM