Pawan Kalyan: బాధ్యత పెరిగింది.. చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను
ABN, Publish Date - Jun 20 , 2024 | 04:34 PM
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasenani)అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా (Pithapuram Mla) గెలవడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని పొందారు.
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasenani)అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా (Pithapuram Mla) గెలవడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని పొందారు. దాంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే! చాలా అరుదుగా పవన్ కల్యాణ్ (Ap Depury Cm) తన ఇన్‌స్ట్టాలో పోస్ట్ పెడుతుంటారు. బాధ్యతలు స్వీకరించిన తదపరి ఆయన ఇనస్టాలో తొలి పోస్ట్ పెట్టారు. తన బాధ్యత మరింత పెరిగిందని రాసుకొచ్చారు. ఓ వీడియో షేర్ చేసిన ఆయన ‘ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.
పవన్ షేర్ చేసిన వీడియోలో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్‌కు వచ్చి పూజలు నిర్వహించడం చూపించారు. ఫైల్స్ మీద సంతకాలు చేయడంతో పాటు పలువురు అధికారులకు ఆయన అభివాదం చేయడం ఆ వీడియోలో చూడొచ్చు.