Pawan Kalyan: రామ్ చరణ్‌కు అభినందనలు
ABN, Publish Date - Apr 12 , 2024 | 02:51 PM
చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు.
చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్ (Global Star Ram Charan) కు గౌరవ డాక్టరేట్ (Doctorate) దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ.. పవన్ కళ్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. అందులో..
*Gaami: స్నో కింగ్‌డమ్‌లో.. ఇదే ఫస్ట్ టైమ్.. జీ5లోకి వచ్చేసిన ‘గామి’
‘‘చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ.. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తమిళనాడులోని వేల్స్ విశ్వ విద్యాలయం (Vels University) వారు రామ్ చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం. గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని... మరెన్నో పురస్కారాలు… మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను..’’ అని తెలిపారు. (Pawan Kalyan Letter On Doctorate to Ram Charan)
అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్‌ను సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందిస్తోంది. దీంతో ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, స్టార్ డైరెక్టర్ శంకర్ వంటి వారి సరసన చేరారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదలు ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చేంత వరకు ఆయన అంకిత భావంతో అసాధారణ ప్రతిభను చూపించారు. ఇటీవల రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన విజయంతో రియల్ గేమ్ ఛేంజర్‌గా మారి గ్లోబల్ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనిర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందచేస్తోంది. ఈ వేడుక ఏప్రిల్ 13న గ్రాండ్‌గా జరగనుంది. తమ అభిమాన హీరోకు దక్కిన గౌరవంపై రామ్‌చరణ్ అభిమానులు (Mega Fans) ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్
**********************
*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..
****************************
*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!
*********************