Pawan Kalyan: టాలీవుడ్ బావుండాలి.. వైసీపీలా వేధించడం మాకు రాదు
ABN, Publish Date - Sep 21 , 2024 | 10:32 PM
తెలుగు సినీ పరిశ్రమకు (tollywood) మంచి చేయాలన్నదే సీఎం చంద్రబాబు (Chandrababu naidu)సారధ్యంలో ఏపీ ప్రభుత్వం విధానం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan) అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు (tollywood) మంచి చేయాలన్నదే సీఎం చంద్రబాబు (Chandrababu naidu)సారధ్యంలో ఏపీ ప్రభుత్వం విధానం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan) అన్నారు. వ్యక్తుల రాజకీయ సంబంధాలతో తమకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ‘దేవర’ (Devara Spl shows) స్పెషల్ షోలతోపాటు టికెట్ ధర పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్.. సీఎం చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసింది. దీనిపై పవన్ కల్యాణ్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు.
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి చేయాలన్నదే చంద్రబాబు నేతృత్వంలో ఎన్‌డీఎ కూటమి విధానం. మాకు వ్యక్తుల రాజకీయాలతో సంబంధం లేదు. పరిశ్రమను మేం గౌరవిస్తాం. వైసీపీ (YCP)ప్రభుత్వం తరహాలో నిర్మాతలను, సినీ నటులను వేధించడం మా విధానం కాదు. ఆ ప్రభుత్వం సమయంలో వారు ఎదుర్కొన్న కష్టాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీ సినిమాకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ‘దేవర’ చిత్రానికి పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేవర’ మూవీ విడుదల రోజు అర్థరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే టికెట్ ధరను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. సింగి్ స్ర్కీన్స్‌లో జీఎస్టీతో కలిసి అప్పర్ క్లాస్ రూ.110, లోవర్ క్లాస్ రూ.60, మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో రూ.135 వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో చిత్ర కథనాయకుడు ఎన్టీఆర్.. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.