Raj Tarun Case: లావణ్య ఆత్మహత్యాయత్నం.. నా చావుకు కారణం వారే!

ABN, Publish Date - Jul 13 , 2024 | 07:47 PM

రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల ముక్కోణపు ప్రేమకథ భయంకరమైన ట్విస్ట్‌లతో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఓ చాట్ వైరల్ అవుతోంది. మొదట రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చిన లావణ్య.. కొన్ని రోజులుగా వార్తలలో హైలెట్ అవుతోన్న విషయం తెలిసిందే.

Lavanya and Raj Tarun Case

రాజ్ తరుణ్, లావణ్య (Lavanya), మాల్వి మల్హోత్రా (Malvi Malhotra)ల ముక్కోణపు ప్రేమకథ భయంకరమైన ట్విస్ట్‌లతో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఓ చాట్ వైరల్ అవుతోంది. మొదట రాజ్ తరుణ్ (Raj Tarun) నన్ను మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చిన లావణ్య.. అతనికి, తనకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అలాగే రాజ్ తరుణ్ తనను పెళ్లాడినట్లుగా, ఓసారి అబార్షన్ చేయించినట్లుగా కూడా చెప్పి.. అతనిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. ప్రేమ, పెళ్లి, అబార్షన్ వంటి అంశాలతో సాగిపోతున్న ఈ కథలో లావణ్య చెబుతున్న ప్రకారం విలన్ మాత్రం ‘తిరగబడరసామి’ హీరోయిన్ మాల్వి మల్హోత్రానే.

Also Read- Tollywood Hero: ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో?

రాజ్ తరుణ్‌తో రిలేషన్‌ పెట్టుకుని తన కాపురంలో నిప్పులు పోస్తుందనేది లావణ్య ప్రధాన ఆరోపణ అనేది తెలిసిన విషయమే. ఆరోపణే కాదు.. ఆధారాలు కూడా లావణ్య చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. మాల్వి మల్హోత్రా మాత్రం నాకేం తెలియదు.. జస్ట్ అతని సినిమాలో హీరోయిన్‌ని మాత్రమే అంటూ.. ఆమె కూడా లావణ్యపై కంప్లయింట్ చేసింది. మరోవైపు రాజ్ తరుణ్ వాదన మరోలా ఉంది. లావణ్యతో రిలేషన్‌లో లేనని, ఆమె మస్తాన్ అనే మరొకరితో రిలేషన్‌లో ఉందంటూ, డ్రగ్స్ తీసుకుంటుందంటూ.. ఆమెపై సంచలన ఆరోపణలు చేసి.. ఈ కథకి కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ముక్కోణపు ప్రేమకథలో అసలు నిజం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉండగా.. ఇప్పుడు లావణ్య ఆత్మహత్యాయత్నం చేసి ఈ కథకి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. (Hero Raj Tarun and Lavanya Case)


లావణ్య ఆత్మహత్యాయత్నానికి ముందు.. తన లాయర్‌తో చేసిన చాటింగ్ ఇప్పుడు బయటికి వచ్చింది. లాయర్‌తో చాట్ అనంతరం ఆమె డయల్ 112కి కాల్ చేయడంతో.. అలెర్ట్ అయిన నార్సింగి పోలీసులు .. హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకుని, ఆమెని కాపాడి, కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. లాయర్‌తో చేసిన చాట్‌లో ఈ జీవితంలో, ప్రపంచంలో నా ప్రయాణం పూర్తయింది. అందుకే ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నాను. నేను ఏంటో తెలిసినవారే నన్ను తప్పుబడుతున్నారు. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచి అండగా ఉన్నారు. నేను అంతా కోల్పోయాను. మన సిస్టమ్‌ని నమ్మి మోసపోయాను. అందరూ నన్ను మోసం చేశారు. మైండ్ గేమ్స్, గాసిప్స్‌తో విసిగిపోయా. ఈ పోరాటంలో నేను విజయం సాధించకపోవచ్చు కానీ.. దేవుడనేవాడు అంతా చూసుకుంటాడని నమ్ముతున్నాను. మస్తాన్ కేసు విషయంలో అంతా ప్లాన్ చేసి, నన్ను కీలుబొమ్మని చేసి నాతో ఆడుకున్నారు. ఆ తర్వాత కూడా నేను మాల్వి మల్హోత్రాని రిక్వెస్ట్ చేశా.. అయినా కూడా ఆమె మానుకోలేదు. మాకు తినడానికి తిండిలేదు అని అడుక్కున్నా.. అనే వరకే ఈ చాట్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చాట్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి నెటిజన్లు.. ఇదంతా ఆ లాయర్ ప్లానింగ్, ఇంకా ఆమెని ఇరికిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

Read Latest Cinema News

Updated Date - Jul 13 , 2024 | 07:47 PM