NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్
ABN, Publish Date - Aug 09 , 2024 | 04:38 PM
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి చెందిన ఇద్దరు ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు)లు, శుక్రవారం వారి సినిమాల అప్డేట్స్తో అభిమానుల్లో ఆసక్తిని, అదే సమయంలో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశారు. అందులో ఒక ఎన్టీఆర్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాగా, మరో ఎన్టీఆర్.. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ తనయుడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావే.
తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)లో నందమూరి కుటుంబానికి చెందిన ఇద్దరు ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు)లు, శుక్రవారం వారి సినిమాల అప్డేట్స్తో అభిమానుల్లో ఆసక్తిని, అదే సమయంలో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశారు. అందులో ఒక ఎన్టీఆర్ (NTR).. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Young Tiger Jr NTR) కాగా, మరో ఎన్టీఆర్.. హరికృష్ణ (Harikrishna) పెద్ద కుమారుడైన జానకీరామ్ (Janakiram) తనయుడు. అతని పేరు కూడా నందమూరి తారక రామారావే. నందమూరి వారసులుగా వీరిద్దరూ సేమ్ పేరుతో సినిమాలు చేస్తే.. ఇకపై ఫ్యాన్సే కాదు ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజ్ అవుతారనేలా అప్పుడే ఇండస్ట్రీలో వార్తలు మొదలయ్యాయి.
Also Read- Thriller Movies: ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో రెండు ఎక్సయిటింగ్ థ్రిల్లర్స్
ముందు ముందు ఏమోగానీ.. శుక్రవారం ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల సినిమాల అప్డేట్తో ఫ్యాన్సే కన్ఫూజ్ అయ్యారు. ‘కెజియఫ్’, ‘సలార్’ సిరీస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేయనున్న చిత్రం శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. మరో వైపు నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడైన ఎన్టీఆర్ అరంగేట్రానికి సంబంధించిన ప్రకటన చేసేందుకు దర్శకుడు వైవీఎస్ చౌదరి (YVS Chowdary) మీడియా సమావేశం నిర్వహించారు.
చాలా గ్యాప్ తర్వాత వైవీఎస్ చౌదరి దర్శకుడిగా నందమూరి కుటుంబంలోని నాలుగోతరం నట వారసుడిని పరిచయం చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. హరికృష్ణతో ఆయన పలు సినిమాలను రూపొందించిన విషయం తెలిసిందే. అలాగే నందమూరి ఫ్యామిలీని తన ఫ్యామిలీగా ఫీలయ్యే వైవీఎస్ చౌదరి.. హరికృష్ణ మనవడి పరిచయ బాధ్యతను తలకెత్తుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను, అలాగే నందమూరి నాలుగోతరం వారసుడిని పరిచయం చేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇలా ఒకేరోజు ఇద్దరూ ఎన్టీఆర్‌ల సినిమాల వేడుకలు జరగటం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. వాస్తవానికి శుక్రవారం పంచమి.. మంచిరోజు కాబట్టి సినిమాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగటం, అనౌన్స్మెంట్లు రావటం సహజం. కానీ ఒకే కుటుంబానికి చెందిన, ఒకే పేరు గల వ్యక్తుల సినిమాల అప్డేట్స్ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇక్కడే మరోక ఆసక్తికర చర్చ కూడా నడుస్తొంది. జూనియర్ ఎన్టీఆర్ పేరు తొలుత ‘తారక్’ (Tarak)గా మాత్రమే ఉండేదని.. నటుడిగా ఎంట్రీ ఇచ్చే ముందు తాత పేరును పెట్టుకున్నారనే ప్రచారం నడుస్తుంటుంది.
Also Read- Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ.. సమంతకు అక్క అవుతుందా? ఈ ట్విస్టేంటి?
కానీ హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడుకు పుట్టినప్పుడే నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) అనే పేరు పెట్టారంటూ చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ కుటుంబ వారసులుగా సదరు పేరును పెట్టుకునే హక్కు వారికీ ఉంటుంది. నందమూరి నట వారసత్వాన్ని ముందు తరాలకు తీసుకువెళుతోన్న క్రమంలో ఒకే పేరు ఉండటమనేది కొంత చర్చనీయాంశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ తరుణంలో ఎన్టీఆర్ నామంపై ఇద్దరు వారసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
Read Latest Cinema News