Harsha Sai: హర్ష సాయి ఇష్యూ.. ఆ ఇన్‌ప్లూయెన్సర్‌పై కేసు న‌మోదు

ABN, Publish Date - Oct 06 , 2024 | 06:55 PM

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న‌ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా గత కొన్ని రోజులుగా హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

harsha

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న‌ హర్ష సాయి (Youtuber Harsha Sai)కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా హర్ష సాయి బాగోతాలను బయట పెడుతున్నారు. తాజాగా గత కొన్ని రోజులుగా హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి హర్ష సాయి కేసు గురించి విషయాలు, సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై పెట్టిన కేసులు వివరాలు తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా లాయర్ నాగూర్ బాబు (Nagur Babu) మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. రెండు కోట్లు కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. కానీ ప్రస్తుతం హర్ష సాయి దేశం వదిలి పారిపోయాడు. తను ఇక్కడ లేకున్నా తనకి మ‌ద్దుగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ఇంస్టాగ్రామ్ పేజెస్‌ని వాడుకుంటూ కేసును తారుమారు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాధితురాలు పైన లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్‌తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది మీడియా ఛానల్స్ నిజనిజాలు తెలియకుండా వాటిని ఎంటర్టైన్ చేస్తూ బాధితురాలిని ఇబ్బంది పెడుతున్నారు.


ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించాం. వాస్తవానికి మీడియా చాలా సపోర్ట్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ ద్వారా హ‌ర్ష‌ మోసాలను బయటపెట్టారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ టెలికాస్ట్ చేశారో వాటిని తొల‌గించాల్సిందిగా ధర్మాసనం నుంచి ఇంటెరిమ్ ఆర్డర్ తెచ్చుకున్నాం. అదే విధంగా Firలో ఫైల్ అయిన కంప్లైంట్ ఏంటో తెలియకుండా కొంతమంది వాదనలకు దిగి ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో బాధితురాలని మానసికంగా బాధ పెడుతున్నారు. అలా చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై కేసు ఫైల్ చేశాం. నిజనిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ పై సెక్షన్ 356 కింద డిఫర్మేషన్, 72 ఆఫ్ బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశాం. నిజనిర్ధారణ జరిగే వరకు బాధితురాలి పేరు ఎక్కడా తీయకుండా న్యాయస్థానం నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

నిర్మాత బాలచంద్ర మాట్లాడుతూ.. బాధితురాలు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టగా ఆ త‌ర్వాతి రెండో రోజు నుంచే హర్ష సాయి ఇబ్బంది పెడుతున్నాడు. ఆ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో ఎంత మానసిక బాధకి గురి చేస్తున్నారు. ఈ విష‌యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మాకు అనుకూలంగా తీర్పు లభించింది. ఈ వార్తని మీడియాతో పంచుకోవాలని అదేవిధంగా ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ని నిజనిజాలు తెలియకుండా ఎవరు ఎక్కడ చూపించరాదని న్యాయస్థానం ఆర్డర్ పాస్ చేసిందన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 07:58 PM