Unstoppable 4: నాలుగు గోడల మధ్య ఏం జరిగింది

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:51 PM

జైలులో పవన్‌తో భేటీ.. అసలేం జరిగింది? తీసుకున్న నిర్ణయాలకు నాంది ఎక్కడ పడింది 53 రోజుల చంద్రబాబు జైలు జీవితం ఎలా గడిచింది.. పవన్‌తో దోస్తీపై చంద్రబాబు అసలేమన్నారు.. బాలయ్య ప్రశ్న.. బాబు జవాబు..

జైలులో పవన్‌తో భేటీ.. అసలేం జరిగింది?

తీసుకున్న నిర్ణయాలకు నాంది ఎక్కడ పడింది

53 రోజుల చంద్రబాబు జైలు జీవితం ఎలా గడిచింది 
పవన్‌తో దోస్తీపై చంద్రబాబు అసలేమన్నారు..

బాలయ్య ప్రశ్న.. బాబు జవాబు..

"ఒకప్పుడు నా స్లోగన్‌ థింక్‌ గ్లోబల్లీ.. యాక్ట్‌ లోకల్లీ
ఇప్పుడు అది కాదు నా స్లోగన్‌.. థింక్‌ లోకల్లీ.. యాక్ట్‌ గ్లోబల్లీ..
ఎప్పటికైనా తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఉండాలని నా ఆకాంక్ష’’ అన్నారు  ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్‌ సీజన్‌-4 మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు అతిథిగా హాజరయ్యారు. అధికారంలో లేని సమయంలో ఓసారి ఆయన ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక మరోసారి  షోలో పాల్గొన్నారు. "నేను మాస్‌ హీరో అయితే.. మీరు మాస్‌ లీడర్‌' అని బాలకృష్ణ అనగా 'బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌’ అంటూ సరదాగా సంభాషించారు బాబు. తానెప్పుడూ విరాట్‌ కోహ్లీలాంటి వాడినేనని బాబు అన్నారు.  

చంద్రబాబు నాయుడు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెబుతానని’ ప్రమాణం చేయించగా, ‘సమయస్ఫూర్తిగా సమాధానం’ చెబుతా అని చంద్రబాబు అనడంతో నవ్వులు పూయించింది.  బాలకృష్ణ మీద చంద్రబాబు ఒట్టు వేయడంతో ఆయన ఒక్కసారిగా కంగారు పడ్డారు. ‘మీ చమత్కారం మీది.. మా సమయస్ఫూర్తి మాది’ అంటూ చంద్రబాబు అనడం నవ్వులు వెల్లి విరిశాయి. 

ఈ షో లో పోలీసులు, అరెస్ట్‌ చేయడం, 53 రోజులు జైలులో ఉండడం, పవన్‌ కల్యాణ్‌తో భేటీ, జైలు నాలుగు గోడల మధ్య ఏం జరిగింది? వంటి ఆసక్తికర విషయాలు చంద్రబాబు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాలన్నీ తెలియాలంటే ఈ నెల 25న ఆహాలో స్ట్రీమింగ్‌ అయ్యే ఈ షో చూడాల్సింటే అంటున్నారు బాలయ్య. ఇందులో భాగంగా బాలకృష్ణ అడిగిన కొన్ని ప్రశ్నలు, వాటికి బాబు చెప్పిన సమాధానాలను ఓ ట్రైలర్‌గా విడుదల చేశారు. అసలు ట్రైలర్‌లో ఏముందంటే..

Balayya: ఆకాశంలో సూర్యచంద్రులు లాగా ఆంధ్రాలో బాబుగారు, కల్యాణ్‌బాబు అంటున్నారు. జైలులో మీ ఇద్దరి భేటీ.. అక్కడ ఏం జరిగింది జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారు?
CBN: తెలుగు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన మీటింగ్‌ అది. రెండు నిమిషాలు నేను, పవన్‌కల్యాణ్‌గారు మాట్లాడుకున్నాం. ఒక నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోవడంతో అది హిస్టారికల్‌ డేగా మారింది.  

Balayya: ఆ సమయంలో అరెస్ట్‌ చేస్తారనే సమాచారం మీకు ముందే ఉందా? జైలులో మొదటి రోజు ఎలా అనిపించింది?
CBN: నేను పర్యాటన నిమిత్తం బస్సులో ప్రయాణిస్తుండగా 'మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తున్నాం' అంటూ ఫోన్‌ వచ్చింది. 53 రోజుల పాటు జైల్లో ఉన్నా. తలుపు కొడితే తీసేవారు కాదు. మనసులో ఏదో బాధ.. చావు గురించి ఆలోచించలేదు. కానీ 53 రోజులు ఒకటే ఆలోచన. ఏం జరిగిన తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టను.  

బాలయ్య: మా చెల్లిలితో చూసిన రొమాంటిక్‌ సినిమా ఒకటి చెప్పండి.
చంద్రబాబు: నువ్వు మరీ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసే ప్రశ్నలు వేస్తే చాలా సమస్యలొస్తాయి.

బాలయ్య: భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరిలో ఎవరు బాస్‌..
బాబు: 'అది చెప్పడమే మాకు కష్టంగా మారింది’ అంటూ భావోద్వేగానికి లోనవుతూనే సరదాగా సంభాషించుకున్నారు.

ఇది  కూడా చదవండి: 
Sandeep Reddy Vanga: అప్పట్లో రంగస్థలం.. ఇప్పుడు పొట్టేల్‌


Updated Date - Oct 22 , 2024 | 03:05 PM