మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Natti Kumar: గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా?

ABN, Publish Date - Feb 03 , 2024 | 08:10 PM

నంది అవార్డుల స్థానంలో ఇకపై ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అవార్డులపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక దళిత బిడ్డ, గొప్ప వ్యక్తి పేరిట అవార్డ్స్ ఇస్తామంటే పరిశ్రమ నోరు మెదపటం లేదు. సినిమా వారికి ఇష్టం లేదో? ఏంటో? తెలియాలి అంటూ నట్టి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Natti Kumar on Gaddar Awards

నంది అవార్డుల స్థానంలో ఇకపై ప్రజా గాయకుడు, దివంగత కళాకారుడు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం నుండి గద్దర్ (Gaddar) ప్రతి జయంతికి కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డు (Gaddar Award)ను ప్రదానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అనంతరం సినిమా ఇండస్ట్రీ నుండి ఒకరిద్దరు మినహా ఎవరూ ఆ అవార్డులపై స్పందించలేదు. తాజాగా నిర్మాత నట్టి కుమార్ నిర్వహించిన మీడియా సమావేశంలో.. గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదా? అంటూ ఇండస్ట్రీని ప్రశ్నించారు. నట్టి కుమార్ మాట్లాడుతూ..

‘‘తెలంగాణలో పదేళ్ల నుంచి, ఏపీలో ఐదేళ్లుగా సినిమా వారికి ప్రభుత్వాలు అవార్డ్స్ ఇవ్వలేదు. తెలంగాణలో గద్దర్ అన్న పేరుతో సినిమా అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ ప్రకటించడం అభినందనీయం. సినిమాతో పాటు నాటకం తదితర రంగాలన్నింటికీ అవార్డులు ఇవ్వాలి. గద్దర్ అన్న పేరుతో అవార్డులు ఇస్తామంటే తెలుగు సినీరంగంలోని పెద్దలు ఎవరూ స్పందించకపోవడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం సినిమా వారికి ఇష్టం లేదో? ఏంటో? తెలియాలి. స్వలాభం కోసం కొందరు ఈమధ్య సీఎంని కలిశారు. ఒక దళిత బిడ్డ, గొప్ప వ్యక్తి పేరిట అవార్డ్స్ ఇస్తామంటే పరిశ్రమలోని వారు నోరు మెదపటం లేదు. (Natti Comments on Gaddar Award)


కేసిఆర్‌ తన పాలనలో ఎవరినీ పట్టించుకోలేదు. కేసిఆర్, జగన్‌లను అవార్డ్స్ ఇవ్వమని పరిశ్రమలో అడిగినవారు ఎవరూ లేరు. అడగకుండానే అవార్డ్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. త్వరలో కొంతమంది చిన్న నిర్మాతలం కలిసి మా కష్టాలు చెప్పుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటున్నాం. ఏపీలో జగన్ పాలన గురించి షర్మిల చెబుతుంటే.. రాజన్న బిడ్డ అని కూడా చూడకుండా ఆమె‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిని జగన్ ఖండించటం లేదు’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Operation Valentine: వరుణ్ తేజ్ సినిమా విడుదల తేదీలో మార్పు.. ఎప్పుడంటే?

**************************

*Natti Kumar: ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ని అందుకే రీ రిలీజ్ చేస్తున్నాం

**************************

*‘సప్త సాగరాలు దాటి’ డైరెక్టర్ తదుపరి చిత్ర హీరో ఎవరంటే?

**************************

*Chiranjeevi: ఎల్‌కే అద్వానీకి ‘భారతరత్న’.. మెగాస్టార్ స్పందనిదే..

*************************

Updated Date - Feb 03 , 2024 | 08:11 PM