National Film Awards: ఏడాది చివర్లో మరోసారి నేషనల్‌ అవార్డుల ప్రకటన ఎందుకంటే!

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:33 PM

శుక్రవారం విడుదలైన నేషనల్‌ అవార్డ్స్‌ కొంత మంది ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చాయి. ఆ జాబితాలో ఉన్న కొన్ని సినిమాలు మినహా మిగతావి గత ఏడాది రిలీజ్‌ అయినవి కాదు. రెండేళ్ల క్రితం... అంటే 2022లో రిలీజ్‌ అయ్యాయి. కొన్ని అప్పటికి సెన్సార్‌ పూర్తి చేసుకున్నవి.

70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను (70th National Film awards) నేడు కేంద్రం ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ‘ఆట్టమ్‌’ను వరించగా.. ఉత్తమ నటుడి పురస్కారం ‘కాంతార’ సినిమాకుగాను రిషబ్‌ శెట్టికి (Rishab Shetty) దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్యమీనన్‌ (Nithya menon) (తిరుచిట్రంబళం), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌)ను జ్యూరీ సంయుక్తంగా ఎంపిక చేసింది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ అయిన చిత్రాలకుగానూ నేడు ఈ అవార్డుల జాబితాను ప్రకటించారు. మళ్ళీ ఈ ఏడాది చివర్లో మరోసారి మరోసారి ప్రకటించే అవకాశం ఉంది. అందుకు కారణం లేకపోలేదు. శుక్రవారం విడుదలైన నేషనల్‌ అవార్డ్స్‌ కొంత మంది ప్రేక్షకులకు షాక్‌ ఇచ్చాయి. ఆ జాబితాలో ఉన్న కొన్ని సినిమాలు మినహా మిగతావి గత ఏడాది రిలీజ్‌ అయినవి కాదు. రెండేళ్ల క్రితం... అంటే 2022లో రిలీజ్‌ అయ్యాయి. కొన్ని అప్పటికి సెన్సార్‌ పూర్తి చేసుకున్నవి. సాధారణంగా గత ఏడాది డిసెంబబర్‌ వరకూ సెన్సార్‌ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ ఏడాది పురస్కారాలు అనౌన్స్‌ చేస్తారు. అయితే రెండేళ్ల క్రితం వచ్చిన సినిమాలకు ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారంటే.. కరోనా కారణంగా పురస్కారాలకు రెండేళ్లు గ్యాప్‌ వచ్చింది. అందువల్ల, అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక, ప్రకటన వంటివి ఆలస్యం అయ్యాయి. ఈ గ్యాప్‌ కవర్‌ చేయడం కోసం 2023 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ పూర్తి చేసుకున్న సినిమాలకు ఈ ఏడాది ఆఖరులో అవార్డులు అనౌన్స్‌ చేయాలని భావిస్తున్నట్లు నేషనల్‌ అవార్డ్స్‌ కమిటీ  జ్యూరీ మెంబర్‌ ఒకరు శుక్రవారం జరిగిన సమావేశంలో తెలిపారు. వచ్చే ఏడాదికి ఎటువంటి గ్యాప్‌ ఉండకూడదని కేంద్ర ప్రభుత్వం, జాతీయ చలన చిత్ర పురస్కార కమిటీ సభ్యుల ఆలోచన. 2025లో అనౌన్స్‌ చేేస 72వ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024లో విడుదలైన సినిమాలకు ఇవ్వాలని ప్రణాళికలు సిద్థం చేశారు. అందుకే, 2024 ఏడాది ఆఖరులో మరోసారి అవార్డులు ఇస్తున్నారు. 970th National Film Awards were announced in December)

పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన కార్తికేయ-2 చిత్రానికి నేషనల్‌ అవార్డు రావడంతో హీరో నిఖిల్‌తోపాటు చిత్ర బృందం ఎంతో ఆనందంగా ఉంది.  ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారం దక్కింది. టాలీవుడ్‌కు చిత్రసీమకు చెందిన నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీకి అవార్డు అందుకున్నారు. ధనుష్‌, నిత్యామీనన జంటగా నటించిన ‘తిరు చిత్రంబళం’లో పాటకు గాను ఆయన్ను పురస్కారం వరించింది. కన్నడలో కేజీఆఫ్‌ -2, తమిళం నుంచి  ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ఉత్తమ ప్రాంతీయ చిరత్రంగా అవార్డులు అందుకున్నారు. ఆ రెండు సినిమాలకు మరిన్ని విభాగాల్లో అవార్డులు వరించాయి. 

Updated Date - Aug 16 , 2024 | 04:35 PM