Nara Rohit: రెంటచింతల అల్లుడు.. నేపథ్యం ఏంటంటే..
ABN, Publish Date - Oct 14 , 2024 | 11:53 AM
నారా రోహిత్ అత్తవారు, సిరీ లెల్ల కుటుంబ నేపథ్యం ఏంటంటే..
నారా రోహిత్ (Nara Rohit) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆదివారం సిరి లెల్లాతో (Siree Lella) ఆయన నిశ్చితార్థం అయింది. వీరిద్దరూ కలిసి ప్రతినిధి -2 చిత్రంలో నటించారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడవడంతో పెళ్లి చేసుబోతున్నారు. ఇప్పుడు ఆయన ఎవరింటి అల్లుడా? అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. సిరి లెల్లా స్వస్థలం రెంటచింతల. వీరిది సామాన్య రైతు కుటుంబం. గురజాల మండలం దైదకు చెందిన నాగేశ్వరరావు ముప్పై ఏళ్ల క్రితం గ్రామం విడిచి రెంటచింతల వలస వచ్చారు. వ్యవసాయం చేస్తూ కష్టపడి నలుగురు కూతుళ్లను ఉన్నత చదువులు చదివించారు. పెద్దమ్మాయి శ్రీలక్ష్మి రెంటచింతలలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు.
Nara Rohit: నారా రోహిత్ ట్వీట్ వైరల్..
రెండో అమ్మాయి భవానీ వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు. మూడో అమ్మాయి ప్రియాంక వివాహం చేసుకొని హైదరాబాద్‌లో ఉంటున్నారు. నాలుగో అమ్మాయి శిరీష ఆరేస్టలియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి కొంత కాలం ఉద్యోగం చేశారు. నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చారు. తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేశారు. నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. అప్పుడు ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆదివారం హైదరాబాద్‌లో వేడుకగా నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి ఉండబోతోందని తెలుస్తోంది.