Daggubati Family: దగ్గుబాటి ఇంట్లో పెళ్లి కొడుకుగా చైతూ.. ఫొటోలు వైరల్

ABN, Publish Date - Dec 06 , 2024 | 06:20 PM

అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వారి పెళ్లి ఫొటోలు స్వయంగా కింగ్ నాగార్జున షేర్ చేశారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ వంతు వచ్చింది. తమ మేనల్లుడిని పెళ్లి కొడుకుని చేసిన ఫొటోలు దగ్గుబాటి ఫ్యామిలీ రివీల్ చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి.

Naga Chaitanya with Daggubati Family Members

బుధవారం అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో ఏయన్నార్‌ విగ్రహం సమీపంలోనే వీరి వివాహం జరిగింది. వివాహానంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి తన ఆనందం వ్యక్తం చేసిన నాగార్జున తన తండ్రి ఏయన్నార్‌ విగ్రహం దగ్గర తమ కుటుంబ సభ్యులందరూ కలసి దిగిన ఫొటోని గురువారం షేర్‌ చేశారు. ఇప్పుడు నాగచైతన్య మదర్ ఫ్యామిలీ, అదే దగ్గుబాటి ఫ్యామిలీ నాగ చైతన్యను పెళ్లి కొడుకును చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Also Read- Game Changer: గేమ్ ఛేంజర్‌కి దెబ్బేసిన 'పుష్ప 2'


అక్కినేని నాగార్జునకు, మొదటి భార్య లక్ష్మీ‌కి జన్మించిన కుమారుడు అక్కినేని నాగచైతన్య. దగ్గుబాటి లక్ష్మీ నిర్మాత డి. రామానాయుడు కుమార్తె అనే విషయం తెలిసిందే. నాగచైతన్యను తన మదర్ లక్ష్మీ దగ్గరుండి మరీ పెళ్లి కొడుకును చేశారు. అలాగే మామయ్యలు దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్ ఇద్దరూ దగ్గరుండి మరీ రెడీ చేయడం విశేషం. వారికి చైతూ ముద్దుల మేనల్లుడు. వెంకీ, చైతూ కలిసి ‘వెంకీ మామ’ అనే సినిమా కూడా చేశారు. ఇక తన మేనల్లుడి పెళ్లి నిమిత్తం వెంకటేష్ దగ్గరుండి మరీ దిష్టి చుక్క పెడుతుండటం విశేషం. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.


ఈ ఫొటోనే కాదు.. దగ్గుబాటి ఫ్యామిలీకి సోదరసోదరీమణులు సురేష్ బాబు, వెంకటేష్, లక్ష్మీ కలిసి చైతూతో దిగిన ఫొటో అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇంకా దగ్గుబాటి రానా మరో స్పెషల్ ఎట్రాక్షన్. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ గ్రూప్ ఫొటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక చైతూ, శోభితల పెళ్లి అనంతరం వారిద్దరిని నాగార్జున వెంటబెట్టుకుని శ్రీశైలం టెంపుల్‌కి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి పెళ్లి నిమిత్తం మీడియాకు, స్నేహితులకు, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికీ నాగ్ థ్యాంక్స్ చెప్పారు. నా కుమారుడి పెళ్లి కేవలం కుటుంబ వేడుకే కాదు.. మీ అందరి వల్ల అది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమైంది. అక్కినేని కుటుంబం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు అంటూ నాగ్ పేర్కొన్నారు.


Also Read-SoChay Wedding: ఘనంగా నాగ చైతన్య, శోభితల వివాహం.. కింగ్ నాగ్ స్పందనిదే..

Also Read-Dushara Vijayan: అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2024 | 06:45 PM