Mega Star Chiranjeevi: జిమ్లో చిరంజీవి వర్కౌట్స్.. ట్రెండింగ్లో మెగాస్టార్!
ABN, Publish Date - Feb 01 , 2024 | 11:36 AM
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా కోసం ఆయన ఓ ట్రైనర్ సమక్షంలో జిమ్లో సాధన చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోప్ట్ చేయగా బాగా వైరల్ అవుతున్నది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర (Vishwambhara). మెగా ఫాంటసీ అడ్వెంచర్ జానరల్లో వస్తున్న ఈ చిత్రానికి బింబిసార వంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని రూపొందించిన వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా గత సంవత్సరం అధికారికంగా షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలే సంక్రాంతి పర్వదినం నాడు విశ్వంబర అనే టైటిల్ను ఖరారు చేస్తూ గ్లింప్స్ అండ్ కాన్సెప్ట్ వీడియో అధికారికంగా విడుదల చేశారు.
అనంతరం సినిమా షూటింగ్ పట్టాలెక్కే సమయానికి చిరంజీవి (Chiranjeevi)కి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం నెలకొంది. సెలబ్రిటీలు, అభిమానులు చాలా మంది ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతుండడంతో గడిచిన నాలుగు రోజులుగా మెగాస్టార్ ఈ హడావుడిలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఆ హాడావుడి కాస్త తగ్గడంతో చిరంజీవి తన దైనందిన జీవితంలో బీజీ అయ్యారు. విశ్వంభర సినిమాపై దృష్టి పెడుతూ షూటింగ్కు సంబంధించిన కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు (గురువారం) ఓ ట్రైనర్ సమక్షంలో చిరంజీవి జిమ్లో సాధన చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోప్ట్ చేయగా మెగాస్టార్ అభిమానులు అది చూసి చాలా సంబుర పడుతున్నారు. ఓ సినిమా కోసం చిరంజీవి (Chiranjeevi) పడుతున్న శ్రమను చూసి మెచ్చుకుంటున్నారు. ఇదికదా చిరంజీవి అంటే..ఉత్తగానే మెగాస్టార్ అవుతారా, అవార్డులు వస్తాయా అంటూ గర్వంగా కూడా చెప్పుకుంటున్నారు. మీరూ ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.