Manchu Manoj: హాస్పిటల్‌కు మంచు మనోజ్.. కాళ్లకు బలమైన గాయాలు
ABN, Publish Date - Dec 08 , 2024 | 05:00 PM
ఆదివారం ఉదయం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో.. మరో వైపు అదేం లేదనేలా వెంటనే మోహన్ బాబు ఫ్యామిలీ స్పందించింది. అయితే, ఈ వార్తలో నిజం ఉందనేలా మంచు మనోజ్ క్లారిటీ ఇస్తూ.. తనని కొట్టారని మీడియా సంస్థలకు తెలిపారు. ఇప్పుడాయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.
ఆదివారం ఉదయం నుండి సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై ఒకటే వార్తలు వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని.. ఆస్తులు, స్కూలు వ్యవహారంలో వీరిద్దరి మధ్య దాడులు జరిగినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత అదేం లేదు, ఆ వార్తలు అసత్యం అంటూ మోహన్ బాబు ఫ్యామిలీ వివరణ ఇస్తే.. మరోవైపు మంచు మనోజ్ మాత్రం తనపై తన తండ్రి అనుచరుడు వినయ్ కొంతమందితో దాడి చేశారని తెలుపుతూ మీడియా ముందుకు వచ్చారు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలిపారు. కట్ చేస్తే.. ఇప్పుడాయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.
Also Read-Breaking News: మంచు ఫ్యామిలీలో మంటలు.. మోహన్ బాబు వర్సెస్ మనోజ్
బంజారాహిల్స్‌లోని టిఎక్స్ హాస్పిటల్‌కు మంచు మనోజ్ తన భార్య, టీమ్‌తో చేరుకున్నారు. మంచు మనోజ్‌ని భార్య మౌనికా దగ్గరుండి మరీ హాస్పిటల్‌లో జాయిన్ చేయించారు. కాళ్లకు బలమైన గాయం కావడంతో మంచు మనోజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బంజారాహిల్స్ టిఎక్స్ హాస్పిటల్లో మంచు మనోజ్‌కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంచు మనోజ్ తన భార్యతో కలిసి హాస్పిటల్‌కు వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లుగా మంచు మనోజ్ ఆరోపణలు చేస్తున్నారు. వినయ్‌తో పాటు మరికొంతమంది దాడి చేసినట్లు మంచి మనోజ్ చెబుతున్నారు. మరి అసలు విషయం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఆయన మీడియా ముందుకు వచ్చి.. ఆస్తుల వ్యవహారంలో నాపై దాడి జరిగింది. నా తండ్రి మోహన్ బాబు తన అనుచరుల చేత దాడి చేయించారు. ఖచ్చితంగా ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఇప్పుడిలా హాస్పిటల్‌లో జాయిన్ అవడంతో.. మంచు ఫ్యామిలీలో తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయనేది స్పష్టమైంది.