Ravi Teja: రవితేజకు సర్జరీ.. హాస్పిటల్ బెడ్‌పై ఇలా చూసి..
ABN, Publish Date - Aug 23 , 2024 | 09:10 PM
మాస్ మహారాజా రవితేజ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. RT75 మూవీ సెట్స్‌లో జరిగిన ప్రమాదంలో రవితేజ కుడిచేతికి అయిన గాయానికి హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో సర్జరీ చేశారు. డాక్టర్స్ ఆరు వారాల పాటు రవితేజకు బెడ్ రెస్ట్ సూచించారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తన 75వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూట్‌లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రవితేజ కుడిచేతి కండరాలు చిట్టించినట్లుగా తెలుస్తోంది. అయినా సరే లెక్క చేయకుండా రవితేజ షూట్‌లో పాల్గొనడంతో.. గాయం మరింత ఎక్కువవడంతో.. వెంటనే ఆయన హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌లో జాయిన్ అయ్యారు. (Surgery To Hero Ravi Teja)
Also Read- Cinema Review: మారుతీనగర్ సుబ్రమణ్యం
రవితేజని గాయాన్ని పరిశీలించిన డాక్టర్స్.. వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని చెప్పి.. అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. ప్రస్తుతం రవితేజకు సర్జరీ పూర్తయింది. గత కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి లేకుండా షూటింగ్స్ చేస్తుండటంతో పాటు, ఇప్పుడీ సర్జరీ.. మొత్తంగా ఆయనకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది. ఇక రవితేజ సర్జరీకి సంబంధించి ఓ పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్ చూసిన వారంతా రవితేజకు చిన్న ప్రమాదం కాదు.. పెద్ద ప్రమాదమే జరిగింది అనేలా కామెంట్స్ చేస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
RT75 వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన మరోసారి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం భారీ అంచనాలతో ఇటీవల థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Read Latest Cinema News