Mahesh Babu: ఏమున్నాడ్రా 'బాబు'

ABN, Publish Date - Oct 07 , 2024 | 01:46 PM

మహేష్ తన భార్య నమ్రతాతో కలిసి విదేశాలకు పయనమయ్యాడు ఈ విజువల్స్ చూసిన ఫ్యాన్స్ ఏమున్నాడ్రా 'బాబు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

mahesh babu

ఐదు పదుల వయసుకు చేరువైన మహేష్ బాబు అందం, ఫిట్‌నెస్ ఇప్పటికి ఒక 'మిత్'. ఈ ఏడాది రిలీజైన 'గుంటూరు కారం' మూవీతో సెన్సేషనల్ హిట్‌తో బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాడు. అయితే ఈ సినిమాపై కొందరు అభిమానుల్లో నిరాశ వ్యక్తం చేశారు. జక్కన్న మూవీతో అందరి ఖాతాలు సెటిల్ చేయడానికి బాబు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం మహేష్ ప్రత్యేకమైన డైట్‌తో ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా పెంచిన లాంగ్ హెయిర్, థిక్ బెయిర్డ్ లుక్‌తో ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తున్నాడు. తాజాగా ఆయన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించరు. పింక్ హూడిలో రెడ్ ఫెరారీ క్యాప్ ధరించి తన భార్య నమ్రతాతో కలిసి విదేశాలకు పయనమయ్యాడు. ఈ విజువల్స్ చూసిన ఫ్యాన్స్ ఏమున్నాడ్రా 'బాబు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తరుచుగా ఫారెన్‌కి చెక్కేసే మహేష్ ఈ ట్రిప్ పర్సనల్ ఫ్యామిలీ ట్రిప్పా, అమెరికాలో ఉన్న తన కొడుకు గౌతమ్ దగ్గరికి వెళ్తున్నాడా, రాజమౌళి సినీమా కోసమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read- శ్రీదేవి, జూహీల‌ది ‘లో సోసైటీ’.. నాటి న‌మ్ర‌త‌ కామెంట్స్‌.. ఇప్పుడు వైర‌ల్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 07 , 2024 | 01:46 PM