మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Super Star Krishna: నా ప్రతి జ్ఞాపకంలోనూ జీవించే ఉంటారు.. మహేష్ ట్వీట్ వైరల్

ABN, Publish Date - May 31 , 2024 | 09:51 AM

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా చరిత్రలో ఈ నటశేఖరుడి ప్రస్థానం అద్భుతమైనది. తెలుగు సినిమాకు ఎన్నో సొబగులు అద్దిన, అందించిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Super Star Krishna and Mahesh Babu

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna). తెలుగు సినిమా చరిత్రలో ఈ నటశేఖరుడి ప్రస్థానం అద్భుతమైనది. తెలుగు సినిమాకు ఎన్నో సొబగులు అద్దిన, అందించిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి (Super Star Krishna Birth Anniversary) నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ నటశేఖరుడిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ.. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. (SSKLivesOn)

*Sri Ranga Neethulu OTT: రెండు ఓటీటీలలో ‘శ్రీరంగనీతులు’.. బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్


సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సోషల్ మీడియా వేదికగా తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించారు. ‘‘హ్యాపీ బర్త్‌డే నాన్న.. మీరు ఎంతగానో మిస్ అవుతున్నారు మరియు నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ మీరు జీవించే ఉంటారు..’’ అంటూ మహేష్ తన తండ్రిపై ప్రేమను (Mahesh Babu Post on Super Star Krishna Birthday) కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ చేసిన ఈ ట్వీట్‌కు ఘట్టమనేని అభిమానులందరూ (Ghattamaneni Fans) సూపర్ స్టార్ కృష్ణకు జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. తెలుగు సినిమా ఉన్నంతకాలం మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 31 , 2024 | 09:54 AM