Hema Rave Party: హేమపై ‘మా’ యాక్షన్ వార్తలపై.. మంచు విష్ణు ఏమన్నారంటే?
ABN, Publish Date - May 25 , 2024 | 07:47 PM
బెంగళూరు ఫామ్‌హౌస్ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన వారిలో హేమ పేరు కూడా ఉందని తెలిసిన తర్వాత టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. హేమపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆమెపై ‘మా’ యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు టాలీవుడ్‌లో ప్రత్యక్షమవడంతో.. వాటిపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆమె దోషి అని పోలీసులు తేల్చిన తర్వాతే యాక్షన్ ఉంటుందని ప్రకటించారు.
బెంగళూరు ఫామ్‌హౌస్ రేవ్ పార్టీలో (Rave Party) అడ్డంగా దొరికిన వారిలో హేమ (Hema) పేరు కూడా ఉందని తెలిసిన తర్వాత టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతోంది. హేమపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని హేమ (Actress Hema) కవరింగ్ వీడియోలు చేసినా ఫలితం లేకపోయింది. ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో హేమ పరిస్థితి ఏంటనేలా ఒకటే వార్తలు. ఇదిలా ఉంటే.. ఆమెపై ‘మా’ (Movie Artist Association) యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా కొన్ని వార్తలు టాలీవుడ్‌లో ప్రత్యక్షమవడంతో.. వాటిపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
*Anasuya: విహారయాత్రలో ఫ్యామిలీతో ఛిల్ అవుతోన్న అనసూయ ఫొటోలు
ప్రస్తుతం ‘కన్నప్ప’ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్న మంచు విష్ణు.. ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో.. ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి, శ్రీమతి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషి అనే అంతా గమనించాలి. ఆమె కూడా ఒక తల్లి, భార్య.. కాబట్టి రూమర్స్ ఆధారంగా ఆమె ఇమేజ్‌ను దూషించడం అన్యాయం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది. శ్రీమతి హేమకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను పోలీసులు అందజేస్తే, MAA తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటి వరకు, దయచేసి నిరాధారమైన వార్తలను సెన్సేషన్ చేయకుండా ఉండాలని కోరుతున్నాను..’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. (Manchu Vishnu Reaction on Hema Incident)
కాగా, ఈ రేవ్ పార్టీ (Bengalore Rave Party) వ్యవహారంలో ఇప్పటికే 86 మందికి బెంగళూరు సిసిబి పోలీసులు సమన్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సోమవారం విచారణకు హాజరు కావాలని హేమకు పిలుపు వచ్చినట్లుగా సమాచారం. ఈ విచారణలో డ్రగ్స్ వాడకం.. డ్రగ్స్ సప్లై ఎవరు చేశారనే విషయంపై పాజిటివ్ వచ్చిన వ్యక్తులందరినీ పోలీసులు ప్రశ్నించనున్నారు. బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో విచారణ జరగనుంది.
Read Latest Cinema News