40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈమె ఆమేనా? ఎక్కడా పొంతన లేదు కదా

ABN, Publish Date - Jan 27 , 2024 | 03:53 PM

సినిమాల ఒకలా కనపడితే, నిజ జీవితంలో ఇంకోలా కనపడతారు కొంతమంది నటీమణులు. 'మా ఊరి పొలిమేర' సినిమాలో నటించిన కామాక్షి భాస్కర్ల వెండితెర మీద పల్లెటూరి అమ్మాయిలా కనపడితే, నిజ జీవితంలో ఆమె తాజా ఫోటోస్ చూస్తే మాత్రం అందులో ఆలా కనిపించిన అమ్మాయి ఈమేనా అని అనిపిస్తుంది.

Kamakshi Bhaskarla

'మా ఊరి పొలిమేర' ఆ సినిమా తరువాత వచ్చిన సీక్వెల్ 'మా ఊరి పొలిమేర 2' లో కథానాయకురాలిగా వేసిన కామాక్షి భాస్కర్ల ని చూసారు కదా. ఒక పల్లెటూరి అమ్మాయిగా తన ప్రతిభని నిరూపించుకుంది ఈ అమ్మాయి. నిజ జీవితంలో డాక్టరు అయిన కామాక్షి యాక్టింగ్ అంటే ఇష్టమని యాక్టర్ అయింది. కొన్నేళ్ల క్రితం మిస్ తెలంగాణ గా ఎన్నికైన కామాక్షి చిన్న చిన్న పాత్రల్లో కనపడినా, 'మా ఊరి పొలిమేర' ఆమెకి మంచి పేరు తీసుకువచ్చింది.

అయితే అందులో పల్లెటూరి అమ్మాయిల కనిపించి తన నటనతో మెప్పించిన కామాక్షి తన సామజిక మాధ్యమంలో తాజాగా కొన్ని ఫోటోస్ పోస్ట్ చేశారు. అందులో అసలు సినిమా పాత్రలకి, తన నిజ జీవితంలో వుండే ఫోటోస్ కి అసలు తేడానే కనిపించటం లేదు. ఆమేనా, ఈమె అన్నట్టుగా అంతలా రీల్, రియల్ ఫోటోలకి తేడా వుంది.

ఆమె తన తాజా ఫోటోస్ షేర్ చేస్తూ అవన్నీ 2024 సంవత్సరం క్యాలెండరు కోసం తీసిన ఫోటోలని చెప్పారు. ఆ క్యాలెండరు కోసం ఆమె వివిధ రకాలైన గ్లామర్ ఫోటో షూట్ చేయించారు. అందులో కొన్ని ఆమె తన అభిమానులతో పంచుకుంటూ అవన్నీ ఈ సంవత్సరం క్యాలెండరు కోసం తీయించుకున్న ఫోటోలని అవి ఎవరు తీశారు, ఆ ఫోటోల వెనక పనిచేసిన వాళ్ళ పేర్లు అన్నీ పొందుపరిచారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయని అంటున్నారు.

Updated Date - Jan 27 , 2024 | 03:55 PM