Kamal Haasan: పవన్ కళ్యాణ్.. గర్వంగా ఉంది బ్రదర్..

ABN , Publish Date - Jun 07 , 2024 | 09:42 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగు దేశం, జ‌న‌సేన‌, బిజెపి కూట‌మి భారీ విజయంతో అధికారం చేజిక్కించుకున్న తరుణంలో అన్నీ వర్గాల ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.‌ ఈ లిస్ట్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఉంది. ఫలితాల రోజు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పిన కమల్.. పవన్‌తో స్వయంగా మాట్లాడి అభినందనలు తెలిపినట్లుగా చెప్పుకొచ్చారు.

Kamal Haasan: పవన్ కళ్యాణ్.. గర్వంగా ఉంది బ్రదర్..
Kamal Haasan and Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)కు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం (TDP), జ‌న‌సేన‌ (Janasena), బిజెపి (BJP) కూట‌మి (Kutami) భారీ విజయంతో అధికారం చేజిక్కించుకున్న తరుణంలో అన్నీ వర్గాల ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.‌ ఈ లిస్ట్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఉంది. నాలుగోసారి, సీఏంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్ర‌బాబు నాయుడుకు సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ ఎన్నికలలో కీలక పాత్ర పోషించి పవన్ కళ్యాణ్‌ను గేమ్ చేంజర్‌ (Game Changer)గా అభివర్ణిస్తూ.. అన్నివైపుల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. జూన్ 4న ఫలితాల ప్రకటన రోజే చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్.. శుక్రవారం ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్‌‌తో భావోద్వేగ సంభాషణ అనంతరం నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా సేవ చేసే ఈ యాత్రను ప్రారంభించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. నిన్ను చూసి గర్విస్తున్నాను సోదరా!’’ అని కమల్ హాసన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కమల్ హాసన్ ట్వీట్‌కు పవన్ కళ్యాణ్, జనసేన అభిమానులు ధన్యవాదాలు సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ట్వీట్ (Kamal Haasan Greetings to Pawan Kalyan) వైరల్ అవుతోంది.


Pawan.jpg

ఇదిలా ఉంటే.. చిత్ర పరిశ్రమ కూటమి విజయాన్ని తమ విజయంగా సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితి ఈసారి ఎక్కువగా కనిపించింది. దానికి కారణం లేకపొలేదు. గత ఐదేళ్ల‌కాలంలో సామాన్యలు ఎంతో వేధించబడ్డారో, సినిమా పరిశ్రమ కూడా అంతే జగన్ ప్రభుత్వం వలన ఒడిదుడుకలకు గురైంది. టికెట్ రేట్లు మొదలు.. సినిమా హీరోల రెమ్యూనరేషన్‌లపై అనవసరపు కామెంట్స్.. స్టార్ హీరోలను జగన్ తన‌ క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకుని అవమానకరమైన ట్రీట్మెంట్ ఇవ్వటం‌..‌ ఇలా పైకి కనిపించేలా, కనిపించని రీతిలో అనేక విధాలుగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను, వ్యవస్దలను వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూసింది. ‌ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి‌గా, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)కు తోడుగా నిలబడి, తెలుగు రాజకీయాలలో మునుపెన్నడు లేనటువంటి విజయం సాధించటంలో కీలకపాత్ర పోషించారు.‌ అందుకే ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందుకున్న విజయాన్ని ఇండస్ట్రీ తన విజయంగా ఓన్ చేసుకున్న పరిస్థితి కనబడుతోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 09:42 PM