Jr NTR: ఏపీ ఎన్నికల ఫలితాలపై రియాక్టైన తారక్.. ఏమన్నారంటే?

ABN , Publish Date - Jun 05 , 2024 | 03:21 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కూటమికి అభినందనలు తెలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా.. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ, శ్రీభరత్, పురందేశ్వరిలకు.. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Jr NTR: ఏపీ ఎన్నికల ఫలితాలపై రియాక్టైన తారక్.. ఏమన్నారంటే?
Jr NTR

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections)లో ఘన విజయం సాధించిన కూటమికి అభినందనలు తెలిపారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా.. చంద్రబాబు (Chandrababu), నారా లోకేష్ (Nara Lokesh), బాలకృష్ణ (Balakrishna), శ్రీభరత్ (Sri Bharath), పురందేశ్వరి (Purandeswari)లకు.. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Janasena Chief Pawan Kalyan) కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఇదే..

‘‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్‌కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్‌గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ (Jr NTR Tweet on AP Elections Results) ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Kalyan-Ram.jpg

జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ (Nandamuri Kalyan Ram) రామ్ కూడా ఎక్స్ వేదికగా నందమూరి ఫ్యామిలీ విజేతలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకీ, టీడీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు! మీ కృషి మరియు పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నాను. వరుసగా మూడవసారి హిందూపురం శాసనసభ్యుడుగా అఖండ విజయం సాధించిన నందమూరి బాలకృష్ణ బాబాయ్‌కు శుభాకాంక్షలు. భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్, శ్రీ భరత్, పురందేశ్వరి అత్తగారికి నా శుభాకాంక్షలు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌గారికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించినందుకు నా శుభాకాంక్షలు..’’ అని కళ్యాణ్ రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 05 , 2024 | 03:32 PM