Jr NTR: అమెరికాలో ఫ్యాన్ మీట్.. తారక్ ఇచ్చిన మాటేంటంటే..!
ABN , First Publish Date - 2023-03-08T16:11:51+05:30 IST
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని తల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆయన తనతో మాట్లాడాలని ఆశపడ్డ ఓ అభిమాని తల్లితో వీడియో కాల్‌లో పలకరించారు. ‘
జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) తన అభిమాని తల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆయన తనతో మాట్లాడాలని ఆశపడ్డ ఓ అభిమాని తల్లితో వీడియో కాల్‌లో (Tarak call to Fan mother) పలకరించారు. ‘ఆస్కార్’ ప్రమోషన్స్‌కోసం మంగళవారం అమెరికా చేరుకున్న ఆయన యు.ఎస్‌లోని అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి ఫ్యాన్స్ మీట్‌లో అందరితో ఫొటోలు దిగారు. ఈ తరుణంలో ఓ అభిమాని తారక్ దగ్గరకు వచ్చి... ‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టం. ఒక్కసారి ఆమెతో మాట్లాడతారా? ప్లీజ్’ అని అడగగానే తారక్ అంగీకరించారు. (Jr NTR's Heartfelt Gesture) ఆ అభిమాని తన తలికి వీడియో కాల్ చేయగా.. ఆయన ఫోన్ తీసుకుని ఓ కుటుంబ సభ్యుడిలా మాట్లాడారు. ‘ఎలా ఉన్నారమ్మా. నేను బాగున్నాను. తప్పకుండా కలుద్దాం అమ్మా’ అని మాటిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్(Ntr 30) కొరటాల శివ (Koratala siva) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది.