Bhavatharini: ఇళయరాజా ఇంట విషాదం.. కూతురు భవతారిణి కన్నుమూత
ABN, Publish Date - Jan 25 , 2024 | 09:57 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు భవతారిణి (47) ఈ రోజు సాయంత్రం మృతి చెందింది.
ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) ఇంట విషాదం నెలకొంది. ఆయన కూతురు భవతారిణి (47) (Bhavatharini) ఈ రోజు సాయంత్రం మృతి చెందింది. కాలేయ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న ఆమె గత కొంతకాలంగా శ్రీలంకలో చికిత్స పొందుతూ ఉంది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకు మరణించింది. ఆమె భౌతికకాయాన్ని రేపు (26.01.2024) చెన్నైకి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇళయరాజా (Ilayaraja)కు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా అనే ఇద్దరు కుమారులు, కూతురు భవతారిణి (Bhavatharini ) ముగ్గురు సంతానం కాగా, ముగ్గురు సినిమా రంగంలోనే రాణిస్తున్నారు. ‘భారతి’ అనే సినిమాలో ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు సైతం సాధించారు.
తెలుగులోను వందకు పైగానే పాటలు పాడారు. అయితే ఆమె కెరీర్ లో ఎక్కువ పాటలు తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలోనే పాడడం విశేషం. భవతారిణి (Bhavatharini) మరణవార్త తెలిసి, సినీ రంగ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.