Tripti Dimri: ఈ నయా నేషనల్ క్రష్ గురించి.. ఈ విషయాలు తెలుసా?
ABN, Publish Date - Jan 04 , 2024 | 04:57 PM
‘జోయా’... బాగా తెలిసిన పేరులా ఉంది కదూ. ఇటీవల విడుదలైన ‘యానిమల్’ చిత్రంలోని పాత్ర పేరు అది. అందులో అంతగా ఒదిగిపోయి.. ఒక్కసారిగా దేశంలోని సినీ ప్రేమికులందరికీ దగ్గరైంది తృప్తి డిమ్రీ. రణబీర్‌తో నటించిన రస రమ్యమైన సన్నివేశాలు.. తృప్తిని నయా ‘నేషనల్ క్రష్’గా మార్చేశాయి. ఇప్పుడు ఆమె సొగ‘సిరుల’ రహస్యాన్ని ఛేదించేందుకు సెర్చ్‌ఇంజన్స్‌లో తెగ శోధిస్తోంది నవతరం. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
‘జోయా’... బాగా తెలిసిన పేరులా ఉంది కదూ. ఇటీవల విడుదలైన ‘యానిమల్’ చిత్రంలోని పాత్ర పేరు అది. అందులో అంతగా ఒదిగిపోయి.. ఒక్కసారిగా దేశంలోని సినీ ప్రేమికులందరికీ దగ్గరైంది తృప్తి డిమ్రీ (Tripti Dimri). రణబీర్‌తో నటించిన రస రమ్యమైన సన్నివేశాలు.. తృప్తిని నయా ‘నేషనల్ క్రష్’గా మార్చేశాయి. ఇప్పుడు ఆమె సొగ‘సిరుల’ రహస్యాన్ని ఛేదించేందుకు సెర్చ్‌ఇంజన్స్‌లో తెగ శోధిస్తోంది నవతరం. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఏడెనిమిదేళ్ల కిందట ‘పోస్టర్ బాయ్స్’తో ప్రారంభమైంది తృప్తి కెరీర్. ఆమె చిత్రాల్లో థియేటర్‌లో కంటే ఓటీటీలో విడుదలైనవే ఎక్కువ. కానీ ‘యానిమల్’ తృప్తికి మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటివరకు ఏ కొద్దిమందికో తెలిసిన ఆమె పేరు... ఆ తరువాత నుంచి దేశవ్యాప్తంగా వినిపించడం మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో అభిమానులు అమాంతం పెరిగిపోయారు. ఇన్‌స్టాలో దాదాపు అర కోటి మంది తృప్తిని ఫాలో అవుతున్నారు. ట్విటర్ తదితర వేదికల్లో ఫాలోయింగ్ దీనికి అదనం. రణబీర్‌తో పండించిన సన్నివేశాలకు అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఆ విమర్శలు తొలుత నన్ను బాగా కలవర పెట్టాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ నాకు ఇలాంటి అనుభవం ఎదురవలేదు. శృంగార సన్నివేశాలు తీస్తున్నప్పుడు నేను, రణబీర్, దర్శకుడు, కెమెరామన్ మాత్రమే సెట్‌లో ఉన్నాం. నాకు ఏ ఇబ్బందీ కలగకుండా వారు చూసుకున్నారు. నాకు అసౌకర్యంగా లేనప్పుడు, నేను చేస్తున్నది తప్పు కాదని నమ్మినప్పుడు... ఎవరో ఏదో అన్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం’ అంటున్న తృప్తి పుట్టి పెరిగిన ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని గఢవాల్.
కొన్నేళ్ల తరువాత ఆమె కుటుంబం ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు మారింది. అక్కడి ‘ఢిల్లీ పబ్లిక్ స్కూల్’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తరువాత ఢిల్లీలోని ‘శ్రీ అరబిందో కాలేజీ’ నుంచి సైకాలజీలో డిగ్రీ పట్టా పొందింది. మరి నటి కావాలన్న కోరిక తనకు ఎప్పుడు కలిగింది? ‘చదువులో ఎప్పుడూ నేను వెనకే. కనుక జీవితంలో స్థిరపడాలంటే చదువుతో సంబంధం లేకుండా వేరే ఏదన్నా చేయాలనే స్పష్టత చిన్నప్పుడే వచ్చింది. కానీ అది ఏంటనేది తెలియదు. అయితే నేను ప్రయాణించాల్సిన మార్గం నిదానంగా నిర్మితమైంది... అదీ నా ప్రమేయం లేకుండానే. ఎలాగంటే... మా సోదరుడి స్నేహితుడు ఒకరు ఫొటోగ్రాఫర్. నన్ను చూసి ఒక రోజు తనే అన్నాడు... ‘టెస్ట్ ఫొటో షూట్ చేద్దాం’ అని. షూట్ అయిపోయింది. అతనే నా ఫొటోలను ఎవరికో పంపించాడు. ఇక అక్కడి నుంచి అవకాశాలు మొదలయ్యాయి. తొలుత ప్రింట్ షూట్స్ చేశాను. ఆ షూట్స్ చూసి ఆడిషన్స్‌కు రమ్మని కాల్స్ వెల్లువెత్తాయి. క్రమంగా నటనతో ప్రేమలో పడ్డాను. అప్పుడు అనుకున్నాను... నటనే నా కెరీర్ అని’ అంటున్న తృప్తి పుణేలోని ‘ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో శిక్షణ తీసుకుంది.
రెండు మూడు సినిమాల్లో నటించాక కూడా తనపై తనకు నమ్మకం ఉండేది కాదట. ఎప్పుడైతే భిన్న వర్గాల నుంచి ప్రశంసలు అందాయో అప్పటి నుంచి ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నట్టు ఓ సందర్భంలో చెప్పింది. రెండు చిత్రాలు... తరువాత రెండేళ్ల పాటు ఎలాంటి అవకాశాలూ ఆమెకు రాలేదు. ఆ సమయంలో పరిశ్రమలో కొనసాగాలా... వద్దా? ఒకవేళ వద్దనుకొంటే ఏంచేయాలి? ఎటూ పాలుపోక తనలో తాను ఎంతో సంఘర్షణకు గురైనట్లు ఓ సందర్భంలో తృప్తి చెప్పుకొచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో తనను మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంచింది క్రమశిక్షణ గల జీవనశైలి మాత్రమేనంటోందీ నయా నేషనల్ క్రష్.
ఇవి కూడా చదవండి:
====================
*Sailesh Kolanu: ధైర్యంగా ట్రైలర్‌లోనే కథ చెప్పా.. ఇక మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా!
*******************************
*Indian 2: ‘ఇండియన్-2’ విడుదల ఎప్పుడు?
*******************************
*Sriya Reddy: అమ్మతోడు.. ‘పీఎస్’ స్టోరీ అర్థం కాలేదు
****************************