Hema: నటి హేమకు భారీ ఊరట.. నిషేధం ఎత్తివేత!

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:25 PM

నటి హేమకు ‘మా’ నుంచి భారీ ఊరట లభించింది. ఇటీవల బెంగళూర్ రేవ్ పార్టీ వ్యవహారంలో ఆమెపై ఎలాంటి వార్తలు వచ్చాయో తెలియంది కాదు. ఆ సమయంలో ఆమెపై నిషేధం విధిస్తూ.. ‘మా’ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె డ్రగ్స్‌కు సంబంధించిన టెస్ట్‌లు చేయించుకోగా.. అన్ని నెగిటివ్ రావడంతో.. మళ్లీ ‘మా’కు అప్పీల్ చేసుకుంది. ‘మా’.. ఆమెపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.

Manchu Vishnu and Hema

నటి హేమ (Actress Hema)కు ‘మా’ నుంచి భారీ ఊరట లభించింది. ఇటీవల బెంగళూర్ రేవ్ పార్టీ (Bangalore Rave Party) వ్యవహారంలో ఆమెపై ఎలాంటి వార్తలు వచ్చాయో తెలియంది కాదు. ఈ రేవ్ పార్టీ రైడ్‌లో హేమ డ్రగ్స్ తీసుకుందని, టెస్ట్‌లలో ఆమెకు పాజిటివ్ వచ్చిందని అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపారు. విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు ఆమెపై నిషేధం విధిస్తూ.. ‘మా’ (MAA) నిర్ణయం తీసుకుంది. హేమ విచారణలో నిజంగా తప్పు చేసినట్లు తెలిస్తే.. ‘మా’ ఆమెను బ్యాన్ చేస్తుందని అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించి.. ఆ వెంటనే ఆమెపై బ్యాన్ విధించారు. తాజాగా ఆమెపై ‘మా’ నిషేధం ఎత్తివేసినట్లుగా అధికారికంగా ప్రకటించింది. తన మెంబర్‌షిప్‌పై నిషేధం ఎత్తివేయడంతో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది.

Also Read- Cinema Review: మారుతీనగర్‌ సుబ్రమణ్యం

ఇటీవల ఆమె విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘‘కొన్ని నెలలుగా నాపై మీడియాలో చాలా రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. దాని వల్ల 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా జుట్టు, గోళ్లు, బ్లడ్‌ అన్నీ ఇచ్చి టెస్ట్‌ చేయించుకున్నాను. ఇందులో నాకు నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఇదే విషయాన్ని నేను ఛానల్స్‌‌కు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ, అని మీ ముందు చెప్పడానికి వచ్చాను. అలాగే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Telangan CM Revanth Reddy), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అపాయింట్‌మెంట్‌ అడగటానికి ఈ వీడియో చేశాను. ఈ వీడియో వారికి చేరుతుందని నమ్ముతున్నా’’ అని తెలుపుతూ.. తను చేయించుకున్న టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.


ఇదే రిపోర్ట్స్‌‌ను హేమ.. ‘మా’ (Movie Artist Association) కు పంపంచి.. తనపై నిషేధాన్ని ఎత్తివేయాలని అప్పీల్ చేసుకుంది. హేమ వినతిని పరిశీలించిన ‘మా’ ఎక్జిక్యూటివ్ కమిటీ.. పాజిటివ్‌గా స్పందించడంతో అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఆమెపై ఉన్న నిషేధాన్ని తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ‘మా’ ట్రెజరర్ శివబాలాజీ పేర్కొన్నారు. హేమపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్లుగా ఆయన అధికారికంగా ‘మా’ నుంచి లెటర్‌ను విడుదల చేశారు. దీనికి ట్విట్టర్ వేదికగా హేమ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ ‘మా’. మా అమ్మలా నాపై అంతా ఎంతో దయ చూపించారు. థ్యాంక్యూ విష్ణు బాబు’’ అని పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Aug 23 , 2024 | 04:25 PM