హర్ష సాయి కేసులో ట్విస్టు.. పోలీసుల అదుపులో ఆర్జే శేఖర్ భాషా
ABN, Publish Date - Oct 18 , 2024 | 08:05 PM
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్జే శేఖర్ భాషాను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న హర్ష సాయి (Youtuber Harsha Sai)కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా హర్ష సాయి (Harsha Sai) మీద వస్తున్న ఆరోపణలను వివరిస్తూ బాధితురాలు తరఫున లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి హర్ష సాయి కేసు గురించి విషయాలు, సపోర్ట్ చేస్తున్న కొంతమంది వ్యక్తులపై కేసులు పెట్టినట్లు తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఇన్‌ప్లూయెన్సర్‌ను విచారించగా తాజాగా శేఖర్ భాషా (RJ Shekar Basha) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ యూట్యూబర్ హార్ష సాయి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సదరు మహిళకు సంబంధించిన వాస్తవాలు ఇవి అంటూ కొందరు ఇన్‌ప్లూయెన్సర్స్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో, అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ బాధితురాలి తరుపు అడ్వకేట్ నాగూర్ బాబు (Nagur Babu) మీడియా ఎదుటకు వచ్చి మాట్లాడారు.
ఈ సందర్భంగా కొంతమంది ఇన్‌ప్లూయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష (RJ Shekar Basha) , కరాటే కళ్యాణి (Karate Kalyani), మహీధర్ వైబ్స్ పై సెక్షన్ 356 కింద డిఫర్మేషన్, 72 ఆఫ్ బిఎన్ఎస్ కింద కేసులు పెట్టినట్లు వివరించారు. నేపథ్యంలో గత వారం క్రైమ్ పోలీసులు ఓ ఇన్‌ప్లూయెన్సర్‌ను విచారించగా ఈ రోజు (శుక్రవారం) ప్రముఖ ఆర్జె శేఖర్ భాషా (RJ Shekar Basha) ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మూడు గంటలకు పైగా సైబర్ క్రైమ్ ఆఫీస్‌లో పోలీసులు ఆర్జె శేఖర్ భాషను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.