HanuMan: ‘హను-మాన్’ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ ఎంత ఇచ్చారంటే..
ABN, Publish Date - Jan 11 , 2024 | 01:53 PM
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న విడుదల కాబోతోన్న ఈ సినిమా రివ్యూని బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’ (Hanu-Man). తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ చిత్రం.. టీజర్, పాటలు, ట్రైలర్‌కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా పాన్ వరల్డ్ సినిమాగా చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు ప్రకటించగా.. టికెట్లు అన్నీ హాట్ కేక్‌లా అమ్ముడైపోయాయి. దీంతో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారనేది అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమాను చూసిన బాలీవుడ్ క్రిటిక్ తన రివ్యూని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. సినిమాలో ఏమేం బాగున్నాయో వివరంగా చెబుతూ.. ‘హను-మాన్’కు 3.5 రేటింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ బాలీవుడ్ క్రిటిక్ ఎవరనుకుంటున్నారా? తరణ్ ఆదర్శ్ (Taran Adarsh).
వన్ వర్డ్ రివ్యూ అంటూ ‘హను-మాన్’ సినిమా మనోహరంగా ఉందని తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ‘‘ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకి అందించాడు. హనుమాన్ సినిమా చాలా బాగుంది. ఇందులో డ్రామా, ఎమోషన్స్, విఎఫ్‌ఎక్స్ మరియు పురాణాలకు సంబంధించిన విషయాలతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాని మలిచాడు. గూజ్‌బంప్స్ తెప్పించే సీన్లు, అదిరిపోయే క్లైమాక్స్.. ఈ సినిమాకు ప్రధాన బలం. నేను ఈ సినిమాను ప్రేక్షకులకు రికమెండ్ చేస్తున్నాను. (Hanu Man First Review)
ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే.. ఇందులో నటించిన నటీనటులందరూ అసాధారణమైన నటనను కనబరిచారు. తేజ సజ్జా తన పాత్రకు న్యాయం చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ తన మార్క్‌ని ప్రదర్శించింది. వినయ్ రాయ్ చాలా భయంకరంగా కనిపించాడు. సముద్రఖని తన సూపర్ ఫామ్‌ని కొనసాగించాడు. వెన్నెల కిశోర్ చాలా బాగా చేశాడు. ఇంకొన్ని సన్నివేశాలు ఆయనపై చేసి ఉండవచ్చు. కథకు సరిపడా విఎఫ్‌ఎక్స్ కీలక భూమిక పోషించాయి. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఒక్క విషయం ఏమిటంటే.. రన్ టైమ్ ఇంకాస్త తగ్గి ఉంటే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు లాగ్ అనిపిస్తాయి. (గమనిక: ఇది హిందీ వెర్షన్)’’ అని తెలుపుతూ.. 3.5 రేటింగ్ ఇచ్చారు. తరుణ్ ఆదర్శ్ రివ్యూ చూసిన వారంతా.. సినిమా యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు. (Taran Adarsh HanuMan Review)
ఇవి కూడా చదవండి:
====================
*Guntur Kaaram: మేకింగ్ వీడియో.. ఆ మాస్ స్వాగ్‌కి సలామ్ చేయాల్సిందే
***********************
*King Nagarjuna: రాసిపెట్టికోండి.. కిష్టయ్య బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నాడు
*************************
*Deviyani Sharma: ఆ హీరో సరసన నటించాలన్నదే నా జీవితాశయం
***************************
*Lavanya Tripathi: పాపం.. లావణ్య త్రిపాఠికి కొత్త కష్టాలు..
***********************