Guntur Kaaram: ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. నిజంగానే మడతపెట్టేస్తోంది
ABN, Publish Date - Jan 18 , 2024 | 06:35 PM
‘గుంటూరు కారం’ సినిమా థియేటర్లలో, అందులోని పాట యూట్యూబ్‌లో మడతబెట్టేస్తున్నాయి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి.. థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా.. సినిమా విడుదలకు ముందు వదిలిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా ‘కుర్చీ మడతపెట్టి’ రికార్డ్ క్రియేట్ చేసింది.
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా థియేటర్లలో, అందులోని పాట యూట్యూబ్‌లో మడతబెట్టేస్తున్నాయి. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి.. థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండగా.. సినిమా విడుదలకు ముందు వదిలిన ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ (Kurchi Madathapetti Lyrical Song) యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ విషయం స్వయంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 50 ప్లస్ మిలియన్ల వ్యూస్ రాబట్టి.. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటలోని లిరిక్స్, మహేష్-శ్రీలీలల డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులకి యమా కిక్ ఇస్తున్నాయి. ఈ హై వోల్టేజ్ మాస్ నంబర్‌లో అదిరిపోయే బీట్‌లు మరియు గ్రామీణ ప్రాంతాల్లో వినే జానపద శైలి సాహిత్యం ప్రేక్షకులని అలరిస్తున్నాయి. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించారు. ‘రాజమండ్రి రాగ మంజరి... మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్తిరి’, ‘తూనీగ నడుములోన తూటాలెట్టి ... తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి... మగజాతినట్టా మడతపెట్టి..’ వంటి పదాలు మరియు పదబంధాలు 80ల నాటి సూపర్‌స్టార్ కృష్ణ యొక్క క్లాసిక్ మాస్ చిత్రాలను గుర్తు చేస్తుండటంతో శ్రోతలు రిపీటెడ్ మోడ్‌లో ఈ పాటను చూస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మించిన ‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. ‘అతడు, ఖలేజా’ వంటి క్లాసికల్ చిత్రాలను అందించిన నటుడు-దర్శకుడు కలయికలో వచ్చిన ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Sundeep Kishan: ‘ఈగల్’ రిలీజ్ డేట్ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు
*********************************
*NTR: ఎన్టీఆర్‌కు హాలీవుడ్, బాలీవుడ్ అవకాశాలు వచ్చినా తిరస్కరించారు.. ఎందుకంటే?
*******************************
*Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. జనసైనికుల లేఖలు చూసి పవన్ భావోద్వేగం
****************************
*Rajinikanth: రజనీ అభిమానులతో పొరుగింటి వృద్ధ మహిళ వాగ్వాదం
*************************
*ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం: బాలకృష్ణ
**************************