Google Search Trends 2024: వ్యక్తుల జాబితాలో టాప్ 5లో పవన్‌ కళ్యాణ్‌.. ‘యే పవన్ నహీ ఆంధీ హై’

ABN, Publish Date - Dec 11 , 2024 | 08:23 AM

2024లో భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన వ్యక్తులలో జాతీయ దృష్టిని ఆకర్షించిన రాధికా మర్చంట్ వంటి పబ్లిక్ ఫిగర్‌లతో పాటు వినేష్ ఫొగాట్ మరియు లక్ష్య సేన్ వంటి క్రీడా తారలు ఉన్నారు. ముఖ్యంగా టాప్ 5లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. 2024 ముగిసే సమయానికి, భారతదేశంలో గూగుల్‌లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన టాప్ 10 పర్సన్స్ విషయానికి వస్తే..

Pawan Kalyan

ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా.. ఏదైనా విషయం మీద వార్తలో, వివరాలో కావాలన్నా.. అత్యధిక మంది ఆశ్రయించేది గూగుల్‌నే. జనం ఎక్కువగా దేనిపై ఆసక్తి కనబరిచారో ఎప్పుడెప్పుడు దేని గురించి వెతికారో గూగుల్‌ ట్రెండ్స్‌ చెప్పేస్తుంది. 2024లో భారతీయులు ఎక్కువగా వెతికిన అంశాల జాబితాను మంగళవారం గూగుల్‌ ప్రచురించింది. ఇందులో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అగ్రస్థానంలో నిలవగా వ్యక్తుల జాబితాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఐదో స్థానంలో ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే స్త్రీ2 గురించి ఎక్కువ మంది ఆరా తీశారు.

Also Read- Manchu Family Dispute: తలకు గాయం.. హాస్పిటల్‌లో మోహన్ బాబు


2024లో భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన వ్యక్తులలో జాతీయ దృష్టిని ఆకర్షించిన రాధికా మర్చంట్ వంటి పబ్లిక్ ఫిగర్‌లతో పాటు వినేష్ ఫొగాట్ మరియు లక్ష్య సేన్ వంటి క్రీడా తారలు ఉన్నారు. 2024 ముగిసే సమయానికి, భారతదేశంలో గూగుల్‌లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన టాప్ 10 పర్సన్స్ విషయానికి వస్తే..


1. వినేష్ ఫొగాట్: భారతదేశపు రెజ్లింగ్ స్టార్

రెజ్లర్ వినేష్ ఫొగాట్ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఫైనల్‌లో కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంతో పారిస్ ఒలింపిక్స్‌కు అనర్హులుగా ప్రకటించబడటంతో ఆమె కొన్ని రోజుల పాటు వార్తలలో నిలిచింది. ఆ తర్వాత రాజకీయ ఎంట్రీ ఆమెను మరింతగా ట్రెండ్ అయ్యేలా చేసింది.

2. నితిష్ కుమార్: బీహార్ రాజకీయ వ్యూహకర్త

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు మరియు పొత్తులకు ప్రసిద్ధ చెందిన ఆయన ఆన్‌లైన్‌లో మీమ్స్ మరియు చర్చలతో హాట్ టాపిక్ అయ్యారు. అలా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో రెండో స్థానంలో నిలిచారు.

Also Read-మనోజ్.. మీ అమ్మ హాస్పిటల్ పాలైందిరా: మోహన్ బాబు వాయిస్ మెసేజ్ వైరల్

3. చిరాగ్ పాశ్వాన్: నటన నుండి రాజకీయ నాయకుడిగా

దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ నటన నుండి అనూహ్యంగా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. 2024 మోడీ 3.0 క్యాబినెట్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దీంతో ఆయన భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తిగా టాప్ 3 స్థానం కైవసం చేసుకున్నారు.

4. హార్దిక్ పాండ్యా: క్రికెట్ ఆల్‌రౌండర్

ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సంవత్సరం తన ఆటతో పాటు కెప్టెన్సీ వ్యవహరంలోనూ, అలాగే తన వివాహ జీవితం విషయంలోనూ హాట్ టాపిక్ అయ్యారు. తద్వారా ఆయన 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో 4వ స్థానం పొందారు.


5. పవన్ కళ్యాణ్: ‘యే పవన్ నహీ ఆంధీ హై’

పవన్ కళ్యాణ్ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో 5వ స్థానంలో నిలిచారు. ఏపీలో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ప్రధాని మోడీ ప్రశంసలతో పాటు పవన్ లేవనెత్తిన అంశాలు ఆయనని అంతా సెర్చ్ చేసేలా చేశాయి. మరోవైపు ఆయన నటిస్తోన్న ‘ఓజీ’ సినిమా కూడా యాడ్ అవడంతో.. అటు రాజకీయ జీవితం, ఇటు సినిమా జీవితం ఆయనకు మరింతగా ప్రజా ఆసక్తిని తెచ్చి పెట్టి.. 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో 5వ స్థానంలో నిలబెట్టింది.

6వ స్థానంలో నూతన క్రికెటర్ శశాంక్ సింగ్, 7వ స్థానంలో నటి పూనమ్ పాండే, 8వ స్థానంలో అంబానీ కోడలు రాధికా మర్చంట్, 9వ స్థానంలో యువ క్రికెటర్ అభిషేక్ శర్మ, 10వ స్థానంలో బ్యాడ్మింగన్ స్టార్ లక్ష్య సేన్ ఈ జాబితాలో నిలిచారు.

Also Read-రేలంగి వివాహ ఆహ్వాన పత్రిక: 91 సంవత్సరాల క్రితపు శుభలేఖను చూశారా..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 11 , 2024 | 08:26 AM