Kanguva - Thangalaan: రెండేళ్లు దాటుతున్న ఇంకా కొలిక్కి రాలేదు!
ABN, Publish Date - Feb 19 , 2024 | 01:57 PM
ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'తంగలాన్', 'కంగువా' చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రాల విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు స్టూడియో గ్రీన జ్ఞానవేల్ రాజా నిర్మాత.
ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో 'తంగలాన్'(Thangalaan), 'కంగువా'(kanguva) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రాల విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాలకు స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మాత. రెండు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాలే. ఈ రెండు సినిమాల్లో ‘తంగలాన్’ షూటింగ్ ఇప్పటికే పూర్తి పూర్తయింది. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడింది. అయితే వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలియజేయలేదు.
ఇదే బ్యానర్‌లో సూర్య ప్రధాన పాత్రలో ‘కంగువా’ చిత్రం తెరకెక్కుతుంది. పీరియాడికల్ డ్రామాగా శివ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు. సూర్య పార్ట్ షూట్ పూర్తైంది. బాబీ దేవోల్‌పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడక్షన్‌పై ఉంది’ అని ఇటీవల ఆయన చెప్పారు. కంగువా చిత్రం పోస్ట్ ప్రొడక్షన పనుల వల్ల ఆలస్యమైతే.. తంగలాన్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రెండు చిత్రాలు డిలే కావడానికి ఫైనాన్సియల్ ఇష్యూస్ కారణమని నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కోలీవుడ్ మీడియా కూడా ఇదే చెబుతోంది. మరి ఈ రెండు చిత్రాల విడుదలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో చూడాలి.
మరో పక్క ‘తంగలాన్’ చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపె భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘తంగలాన్’ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ‘కంగువా’ షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు కావొస్తుంది. కానీ విడుదలపై ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఆర్థిక పరమైన ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.