Allu Arjun: చెప్పను బ్రదర్ టు థ్యాంక్యూ కళ్యాణ్ బాబాయ్.. మీరు మారిపోయారు సార్

ABN, Publish Date - Dec 07 , 2024 | 07:57 PM

ఫైనల్లీ అల్లు అర్జున్.. హైదరాబాద్‌లో జరిగిన ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్‌లో ‘కళ్యాణ్ బాబాయ్’ అంటూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. అంతే మీరు మారిపోయారు సార్ అంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు మొదలయ్యాయి. విషయంలోకి వస్తే..

Allu Arjun Says Thanks to Pawan Kalyan

ఈ మధ్య మెగా బ్రాండ్ వదిలి సొంతంగా అల్లు ఆర్మీని సిద్ధం చేసుకుంటూ.. మెగాభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి‌కి మద్దతు తెలిపేందుకు స్వయంగా వెళ్లడం, అక్కడ ఆయన చేసిన కామెంట్స్.. అల్లు అర్జున్‌ని పూర్తిగా మెగా బ్రాండ్‌కి దూరం చేశాయి. ఒకవైపు తన ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ పోటీలో ఉండగా.. ఆయన వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడంపై అనేకానేక మాటలను బన్నీ ఎదుర్కొవాల్సి వచ్చింది. అప్పటి నుండి మెగా వేరు, అల్లు వేరు అనేలా ఇండస్ట్రీలో సైతం మార్పు కనిపిస్తూ వస్తుంది. అయితే, ఇది ఇప్పటిది కాదు.. చాలా కాలం నుండే జరుగుతూ వస్తుంది.

Also Read-Janhvi kapoor: వాళ్లే మన సినిమా చూస్తుంటే మీకేంటి నొప్పి..

ఆ మధ్య ఓ మూవీ ఫంక్షన్‌లో మెగాభిమానులు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలని అడగగా.. ‘చెప్పను బ్రదర్’ అంటూ బన్నీ ఫ్యాన్స్‌కి క్లాస్ ఇచ్చాడు. అప్పటి నుండి అల్లు అర్జున్‌లో ఛేంజ్ కనిపిస్తూ వస్తుంది. తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్, మెగా బ్రాండ్‌ని.. మెగాభిమానులని బాధపెడితేనే తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పడుతుందని భావించినట్లుగా ఉన్నాడు. అప్పటి నుండి అల్లు అర్జున్ వేసిన ప్రతి అడుగు మెగాకు ఆయన దూరం అవ్వాలనే చేసినట్లుగా అనిపిస్తూ వస్తుంది. దీనిపై అల్లు అర్జున్ పలు విమర్శలను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌కి దారి తీస్తుండటంతో పాటు, సినిమాలో డైలాగ్ లేకపోయినా ‘బాస్’ పేరుతో మెగా ఫ్యామిలీని ఫ్యాన్స్ అవమానకరంగా మాట్లాడుతూ కొందరు అల్లు అర్జున్, వైసీపీ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుండటంతో.. ఫ్యాన్స్ వార్స్ తారా స్థాయికి చేరాయి. మరి ఈ విషయం గమనించాడో.. లేదంటే తను అంత చేసినా సినిమా టిక్కెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం చూసి కరిగిపోయాడో తెలియదు కానీ.. ఫైనల్లీ అల్లు అర్జున్‌ మారిపోయారు.

అవును, తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ సక్సెస్ మీట్‌లో కళ్యాణ్ బాబాయ్ అంటూ.. మరోసారి పాత అల్లు అర్జున్‌ని గుర్తు చేశారు. ‘‘టిక్కెట్ల ధరలను పెంచుకునేలా జీవో రావడానికి ప్రధానకారణమైన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్యూ. నా వ్యక్తిగతంగా కూడా కళ్యాణ్ బాబాయ్‌కి థ్యాంక్యూ. హార్ట్‌ని టచ్ చేశారు..’’ అని అల్లు అర్జున్ ఈ వేడుకలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ గురించి చెబుతున్న వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. దీనికి మెగా ఫ్యాన్స్ కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతూ.. ‘మీరు మారిపోయారు సార్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read-Shreyas Talpade: నోట్లో కాటన్ పెట్టుకోవాల్సి వచ్చింది.. 'పుష్ప 2'

Also Read-Daggubati Family: దగ్గుబాటి ఇంట్లో పెళ్లి కొడుకుగా చైతూ.. ఫొటోలు వైరల్


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 07 , 2024 | 08:46 PM