Dr Rajasekhar: ‘కల్కి 2898 AD’.. నాకసలు సంబంధం లేదు

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:55 PM

ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ టికెట్ల బుకింగ్‌పై యాంగ్రీమ్యాన్, డాక్టర్ రాజశేఖర్ ఫన్నీ‌గా స్పందించారు. ‘నాకసలు సంబంధమే లేదు’ అంటూ రాజశేఖర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Dr Rajasekhar: ‘కల్కి 2898 AD’.. నాకసలు సంబంధం లేదు
Rajasekhar and Prabhas

ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) టికెట్ల బుకింగ్‌పై యాంగ్రీమ్యాన్, డాక్టర్ రాజశేఖర్ ఫన్నీ‌గా స్పందించారు. ‘నాకసలు సంబంధమే లేదు’ అంటూ రాజశేఖర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే..

Also Read-Anasuya: ఓ షో లో డ్రస్ విప్పేస్తోన్న అనసూయ.. అంత ఆగలేకపోతున్నారా? అంటూ నెటిజన్‌కు రిప్లయ్!

ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) రూపొందించిన ‘కల్కి 2898 AD’ చిత్రం జూన్ 27న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. బుకింగ్ కూడా మొదలైంది. అయితే ‘కల్కి’ పేరుతో గతంలో ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ (Dr Rajasekhar) ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. టికెట్స్ బుకింగ్ యాప్‌లో ప్రభాస్ సినిమాకు టికెట్స్ బుక్ చేస్తుంటే.. అవి రాజశేఖర్ ‘కల్కి’ సినిమాకు బుక్ అయినట్లుగా చూపిస్తుండటంతో.. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. దీంతో రాజశేఖర్ కూడా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


Prabhas-2.jpg

తన సినిమాకు టికెట్స్ బుక్ అవుతుండటం తెలిసిన రాజశేఖర్ సోషల్ మీడియా వేదికగా.. ‘నాకు అస్సలు సంబంధం లేదు’ అంటూ రెండు వైవిధ్యమైన ఎమోజీలను పోస్ట్ చేశారు. తర్వాత మళ్లీ.. ‘‘జోక్ పక్కన పెడితే.. ప్రభాస్, నాగ్ అశ్విన్, మా అశ్విని దత్‌గారు వైజయంతీ ఫిల్మ్స్, మరియు ఇందులో చేసిన అద్భుతమైన నటీనటులందరికీ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఈ సినిమాతో చరిత్ర సృష్టించి.. టాలీవుడ్ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కిస్తారని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇలా టికెట్స్ బుక్ అవుతోన్న విధానంపై సదరు టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో వారు స్పందిస్తూ.. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. రాజశేఖర్ ‘కల్కి’ సినిమాకు టికెట్ బుక్ అయినప్పటికీ.. అది ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రానికి బుక్ అయినట్లుగానే భావించాలని స్పష్టతనిచ్చారు. ఈ టెక్నికల్ ఇష్యూని త్వరలోనే పరిష్కరిస్తామని వారు తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Jun 24 , 2024 | 12:58 AM